సెలబ్రిటీ సఫారీలు ప్రముఖుల రక్షణలో ‘బౌన్సర్లు’

సినీనటులు సెలబ్రెటీలు, ప్రముఖులు నగరానికి వచ్చినప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ ముందుడే వారే బౌన్సర్లు. నటులు, సెలబ్రెటీలు, ప్రముఖులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు వారి రక్షణ బాధ్యత బౌన్సర్లదే. పబ్బులు, క్లబ్బులు, పెద్ద పెద్ద హోటళ్లు, ఫ్యాషన్ ప్రదర్శనలు, టాలీవుడ్, బాలీవుడ్ తారల పర్యటనలు. రాజకీయ,వ్యాపార ప్రముఖుల సందర్శనలు. ఇలా  ఎవరికైనా ఇప్పుడు ముందుగా అవసరమయ్యేది బౌన్సర్లే. ఇదిప్పుడు స్టేటస్ సింబల్‌గా కల్చర్‌గా మారిపోయింది. కొంతమంది బౌన్సర్లను తమ వ్యక్తిగత సహాయకులుగా,అంగరక్షకులుగా […]

సినీనటులు సెలబ్రెటీలు, ప్రముఖులు నగరానికి వచ్చినప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ ముందుడే వారే బౌన్సర్లు. నటులు, సెలబ్రెటీలు, ప్రముఖులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు వారి రక్షణ బాధ్యత బౌన్సర్లదే. పబ్బులు, క్లబ్బులు, పెద్ద పెద్ద హోటళ్లు, ఫ్యాషన్ ప్రదర్శనలు, టాలీవుడ్, బాలీవుడ్ తారల పర్యటనలు. రాజకీయ,వ్యాపార ప్రముఖుల సందర్శనలు. ఇలా  ఎవరికైనా ఇప్పుడు ముందుగా అవసరమయ్యేది బౌన్సర్లే.

ఇదిప్పుడు స్టేటస్ సింబల్‌గా కల్చర్‌గా మారిపోయింది. కొంతమంది బౌన్సర్లను తమ వ్యక్తిగత సహాయకులుగా,అంగరక్షకులుగా నియమించుకుంటున్నారు. ఒకప్పుడు ముంబయికే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పడు గ్రేటర్ హైదరాబాద్‌కు విస్తరించింది. నగరానికి సెలబ్రిటీలు ఎప్పుడు వస్తారు. ఎన్ని రోజులు ఉంటారు. ఎక్కడెక్కడికి వెళ్లుతారు. పర్యటన ఎప్పుడు ముగుస్తుంది? తదితర వివరాలన్నింటిని బౌన్సర్లు పరిగణలోని తీసుకుంటారు. దానికి అనుగుణంగా ప్రముఖుల రాకకు అరగంట ముందే వారు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, అక్కడి నుంచి వారికి రక్షణగా నిలుస్తారు. ఇందుకు అనుభవం ఉన్న వారినే ఎంపిక చేస్తారు. సెలబ్రిటీకి పక్కన వెనుకన బాయ్స్‌ని పెట్టి శిక్షకుడు ముందుడి తోవ చూపుతాడు. అభిమానులు ఎదురైతే వారిని సున్నితంగా తప్పిస్తూ సెలబ్రిటీని తీసుకుని వెళ్తారు. ఎదుటి వారిని నొప్పించకుండా ముందుకు తీసుకువెళ్లడం అనేది వీరికి ఆన్ జాబ్‌లో ట్రైనింగ్‌లో భాగం. ఇక అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటే హ్యూమన్ చైన్‌గా మారి సెలబ్రిటీలకు రక్షణగా ఉండి ముందుకు తీసుకుని వెళ్తారు.

వ్యాయమం,ఆహారం,రక్షణ బౌన్సర్లకు అవసరమైన మూడు అంశాలు. ప్రతి బౌన్సర్ నిత్యం ఉదయంవేళ దాదాపు గంటన్నర సేపు వ్యాయమం చేస్తాడు. ప్రత్యేక శరీరాకృతి కోసం వర్కవుట్స్ చేస్తారు. పౌష్టికాహారం తీసుకుంటారు. ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు సార్లు ఆహారం తీసుకుంటారు. కోడిగుడ్లు, చికెన్‌లాంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారం పైనే వీరు దృష్టి పెడతారు. ప్రస్తుతం బౌన్సర్ వృత్తిలోకి వచ్చేవారిలో చాలమంది కాలేజీ విద్యార్థ్ధులు, నిరుద్యోగులు, జిమ్ కోచ్‌లు ఉన్నారు. బౌన్సర్లగా ఓ కార్యక్రమానికి వెళ్లితే వీరికి దాదాపు రూ.1000 నుంచి రూ.1300 వస్తాయి. కొంతమందికి నెలసరి వేతనాలు కూడ ఇస్తున్నారు. ప్రతి రోజు 8గంటల పాటు వీరు ఉద్యోగం చేస్తే నెలకు దాదాపు రూ.10 వేల నుంచి 20 వేల వరకు చెల్లిస్తున్నారు.

బౌన్సరుగా మారాలంటే బక్కాపల్చగా ఉంటే సరిపోదు. కండపుష్టి ఖచ్చితంగా అవసరం. దాదాపు 5.10 అడుగుల ఎత్తుమొదలుకొని ఆరు అడుగులు, ఆపై ఎత్తు ఉండాలి. నిత్యం వ్యాయామం చేసే అలవాటు తప్పనిసరి. మంచి రూపంతో పాటు అందమైన చూపులు సత్ప్రవర్తన కావాలి. బౌన్సరుగా మారాలనుకునే వారికి మొదట ‘ఆన్ జాబ్ ట్రైనింగ్’ ఇస్తారు. ఏదైనా పబ్బులకు వెళ్తే, అక్కడ పాస్ ఎలా తనిఖీ చేయాలి? నకిలీ పాసులను ఎలా గుర్తించాలి. మనిషిని ఎలా తనిఖీలు స్టాపింగ్, టీజ్, ట్రబుల్ చేసేవారిని గుర్తించడం, వాదించే వారితో ఎలా మసులుకోవాలి. ఎదుటి మనిషి పద్దతులను గుర్తించడం తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. దాదాపు ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చిన తరువాత వారిని బౌన్సర్లుగా నియమిస్తారు.

అందరికి రక్షణ కల్పించే బౌన్సర్లకూ ఇబ్బందులున్నాయి. చూడటానికి గంభీరంగా ఉన్నా, వాటి వెనుక బాధలూ లేక పోలేదు. నగరంలోకి దాదాపు అన్ని పబ్బులు, క్లబ్బులు వీరిని ఉద్యోగంలో నియమించుకుంటున్నాయి. అ లాగే కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనూ అక్కడ విధుల్లో నియమిస్తున్నారు. అయితే పబ్బులు, క్లబ్బుల్లో అతిగా మద్యం సేవించే వారు కొన్ని సందర్భాల్లో బౌన్సర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. సిగరెట్లతో కాల్చినా, కొట్టిన భరించాల్సిందే. తమ అభిమాన నటులను ముట్టుకోనివ్వలేదని వీరిపై దాడులు సైతం జరుగుతుంటాయి. తమకు వచ్చే జీతం తమ తిండికే సరిపోవడం లేదని పలువురు బౌన్సర్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబపోషణ కష్టంగుందని వారంటున్నారు. తమకు యూనియన్ లేదని, కొన్ని సందర్భాల్లో తమపై దాడులు జరుగుతున్నాయని, పోలీసు కేసులు పెట్టిఇబ్బంది పెడుతున్నారన్నారు.

ఎం.సతీష్ ముదిరాజ్,
స్టాఫ్ రిపోర్టర్, మనతెలంగాణ

Comments

comments