సెమీస్ కు భారత్

ఓవెల్ : ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా సెమీ ఫైనల్స్ కు చేరింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 44.3 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ధావన్ 83 […]

ఓవెల్ : ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా సెమీ ఫైనల్స్ కు చేరింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 44.3 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ధావన్ 83 బంతుల్లో 78, కోహ్లీ 101 బంతుల్లో 76 పరుగులుతో చెలరేగిపోయారు. చివర్లో యువరాజ్ సింగ్ 25 బంతుల్లో 23 పరుగులు చేశాడు. దీంతో భారత్ 38 ఓవర్లలో 193 పరుగులు చేసి విజయం సాధించి సెమీస్ కు చేరింది. గురువారం జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది.

Comments

comments

Related Stories: