సెప్టెంబర్ 4న పాక్ అధ్యక్ష ఎన్నికలు

Pak Presidential Election On September 4thఇస్లామాబాద్ : సెప్టెంబర్ 4న పాక్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం గురువారం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం పాక్ అధ్యక్షుడిగా ఉన్న మమ్నూన్ హుసేన్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. దీంతో ఈ రోజు ఎన్నికల సంఘం అధ్యక్షుడి ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. పాక్ అధ్యక్ష ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయి. పార్లమెంట్ సభ్యులు, నాలుగు ప్రావిన్షియన్ అసెంబ్లీలు కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు ఆగస్టు 27వ తేదీ లోపు తమ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలన అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ఆగస్టు 30వ తేదీన విడుదల చేస్తారు. సెప్టెంబర్ 4వ తేదీని ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న మమ్మూన్ హుసేన్ 2013లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ పక్షాన ఆయన బరిలోకి దిగి గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థుల మధ్య గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉంది. పిటిఐ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో పిటిఐ అతి పెద్ద పార్టీగా అవతరించిన విషయం విదితమే. పిటిఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఈనెల 18న పాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Pak Presidential Election On September 4th