సుకుమార్‌తో మెగాస్టార్…?

హైదరాబాద్: ‘రంగస్థలం’ మూవీతో ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు లెక్కల మాస్టారు సుకుమార్. ప్రస్తుతం రంగస్థలం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయన ఇటీవల మాట్లాడుతూ… తన వద్ద మూడు మంచి కథలు ఉన్నాయని, అవి ఎవరికి సెట్ అవుతాయో చూడాలని చెప్పారు. అయితే అందులో ఒక కథను ఆయన మెగాస్టార్ చిరంజీవికి వినిపించాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. రంగస్థలం భారీ విజయం నమోదు చేయడంతో ఆయన సుక్కుతో జతకట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే సుకుమార్ […]

హైదరాబాద్: ‘రంగస్థలం’ మూవీతో ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు లెక్కల మాస్టారు సుకుమార్. ప్రస్తుతం రంగస్థలం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయన ఇటీవల మాట్లాడుతూ… తన వద్ద మూడు మంచి కథలు ఉన్నాయని, అవి ఎవరికి సెట్ అవుతాయో చూడాలని చెప్పారు. అయితే అందులో ఒక కథను ఆయన మెగాస్టార్ చిరంజీవికి వినిపించాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. రంగస్థలం భారీ విజయం నమోదు చేయడంతో ఆయన సుక్కుతో జతకట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే సుకుమార్ మెగాస్టార్‌కు కథ వినిపించాడనేది ఈ వార్త సారాంశం. చిరంజీవి కథ వినేందుకు సమయం కేటాయించడంలో తనయుడు చరణ్ పాత్ర కూడా ఉందనేది భోగట్ట. అంతేగాక ఈ మూవీలో ఒక ప్రధాన పాత్ర కోసం మాస్‌మహారాజ్ రవితేజను సంప్రదించడం, ఆయన అంగీకరించడం జరిగిందనే పుకారు ఇప్పుడు ఇండస్ట్రీలో షికారు చేస్తోంది. చిరూ ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సైరా పూర్తయిన వెంటనే సుక్కుతో కలిసి పనిచేయనున్నారని చెప్పుకుంటున్నారు. అప్పటిలోగా పూర్తిస్థాయిలో కథను తయారు చేయాలని సుకుమార్‌కు మెగాస్టార్ సూచించారని టాక్ తాజాగా ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Comments

comments

Related Stories: