సివిల్స్‌ టాపర్‌‌కు రాష్ట్రపతి ఆహ్వానం

Rashtrapati Bhavan Invites Durishetty Anudeep

జగిత్యాల: సివిల్స్‌లో నేషనల్‌ టాపర్‌గా నిలిచిన జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ కు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆహ్వానం మేరకు ఆగస్ట్ 15న సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్రపతి కార్యాలయం లేఖలో పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో గల కల్చరల్ సెంటర్ కార్యాలయంలో కోవింద్ తో ఎట్ హోమ్ కార్యక్రమం ఉంటుందనేది తెలిసిందే. అయితే, కార్యక్రమానికి వచ్చేటప్పుడు వెంట ఆహ్వాన పత్రంతో పాటు ఫోటో గుర్తింపు కార్డు తీసుకొని రావాలని సూచించారు. కాగా, తమ కుమారుడికి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం రావడం పట్ల అనుదీప్‌ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

comments