సిల్వర్‌తో సరిపెట్టుకున్న సింధు

జకార్తా: భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు ఆసియా క్రీడల్లో భాగంగా బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్‌లో మరోసారి తడబడింది. చైనీస్ తైపీ ప్లేయర్ తై జు యింగ్ చేతిలో సింధు పరాజయం పాలైంది. దీంతో సింధు సిల్వర్‌తో సరిపెట్టుకుంది. తొలి సెట్ నుంచి దూకుడుగా ఆడిన వరల్డ్ నెం.01 యింగ్ 14-21, 16-21 తేడాతో సింధుపై అలవొకగా గెలిచి స్వర్ణం సాధించింది. ఒత్తిడిలో సింధు పదే పదే తప్పులు చేసి అనవసరంగా యింగ్‌కు పాయింట్లు సమర్పించుకుంది. […]

జకార్తా: భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు ఆసియా క్రీడల్లో భాగంగా బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్‌లో మరోసారి తడబడింది. చైనీస్ తైపీ ప్లేయర్ తై జు యింగ్ చేతిలో సింధు పరాజయం పాలైంది. దీంతో సింధు సిల్వర్‌తో సరిపెట్టుకుంది. తొలి సెట్ నుంచి దూకుడుగా ఆడిన వరల్డ్ నెం.01 యింగ్ 14-21, 16-21 తేడాతో సింధుపై అలవొకగా గెలిచి స్వర్ణం సాధించింది. ఒత్తిడిలో సింధు పదే పదే తప్పులు చేసి అనవసరంగా యింగ్‌కు పాయింట్లు సమర్పించుకుంది. దీంతో సింధును మరోసారి ఫైనల్ ఫోబియా వెంటాడినట్లైంది. కాగా, ఈసారి హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సింధు, సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు. 1982 తర్వాత ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో తొలిసారి రెండు పతకాలు దక్కాయి.

Comments

comments

Related Stories: