సిరిసిల్ల జిల్లాకు రానున్న మూడురోజుల పాటు భారీ వర్షాలు

 Heavy rains for three days to come to Sircilla District

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రానున్న మూడురోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర కంట్రోల్ రూమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. రాగల 72 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వర్షాలతో సమస్యలు వస్తే ఫోన్ నెంబర్ 6309141122 లో సంప్రదించాలని కలెక్టర్ శ్రీకృష్ణ భాస్కర్ తెలిపారు. భారీ వర్ష సూచన దృష్ట్యా అధికారులను కలెక్టర్ శ్రీకృష్ణ భాస్కర్ అప్రమత్తం చేశారు.

Comments

comments