మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జి ల్లా కేంద్రంలోని వీధివీధిలో అవసరమైన ప్రతి చోట సిసి కెమెరాలు అమరుస్తామని ఎస్పి రాహుల్ హెగ్డె అన్నారు. సిరిసిల్లలోని శివారు ప్రాంతాలతో సహా పట్టణమంతా కలియ తిరిగి క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఎస్పి మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల ప్రధాన రహదారులతో సహ అవసరమైన అన్నిచోట్ల నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు అమరుస్తామన్నారు. మంగళవారం సి బ్బందితో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశామని, ఏయే ప్రాంతంలో ఏ రకమైన సిసి కె మెరా అవసరమో గుర్తించామన్నారు. వాహనాల స్పీడ్‌ను గుర్తించేందుకు కూడా కెమెరా లు ఏర్పాటు చేస్తామని, కొన్ని మొబైల్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఎంతో ఉపకరిస్తాయని వివరించారు.
Comments
comments