సిరిసిల్లలో నాలుగు పెట్రోల్ బంక్‌లు సీజ్ 

మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు పెట్రోల్ బంకులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. వినియోగదారులకు పెట్రోల్ సరఫరా చేయడంలో తక్కువ పెట్రోల్, డీజిల్ అందిస్తున్నారని పరిశీలనలో తేలడంతో పట్టణంలోని నాలుగు పెట్రోల్ బంక్‌లను సీజ్ చేశారు. సిరిసిల్లలో శుక్రవారం లీగల్ మెట్రాలజీ అధికారి రవీందర్ పెట్రోల్ బంక్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసి, కొలతల్లో తక్కువ వస్తుందని గుర్తించి నాలుగు పెట్రోల్ బంక్‌లపై కేసులు నమోదు చేశారు. వినియోగదారులకు నష్టం కలిగించే […]

మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు పెట్రోల్ బంకులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. వినియోగదారులకు పెట్రోల్ సరఫరా చేయడంలో తక్కువ పెట్రోల్, డీజిల్ అందిస్తున్నారని పరిశీలనలో తేలడంతో పట్టణంలోని నాలుగు పెట్రోల్ బంక్‌లను సీజ్ చేశారు. సిరిసిల్లలో శుక్రవారం లీగల్ మెట్రాలజీ అధికారి రవీందర్ పెట్రోల్ బంక్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసి, కొలతల్లో తక్కువ వస్తుందని గుర్తించి నాలుగు పెట్రోల్ బంక్‌లపై కేసులు నమోదు చేశారు. వినియోగదారులకు నష్టం కలిగించే చర్యలకు ఎవరు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Comments

comments