సిరిసిల్లలో అగ్రికల్చర్ కళాశాలకు శంకుస్థాపన

రాజన్న సిరిసిల్ల: మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కెటిఆర్ కలిసి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్దాపూర్‌లో అగ్రికల్చర్ కళాశాలకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతి వ్యక్తి అభివృద్ధి కోసం సర్కార్ కార్యక్రమాలను రూపొందిస్తుందని చెప్పారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ కల అని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కెసిఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వచ్చే 6 నెలల్లో సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన […]

రాజన్న సిరిసిల్ల: మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కెటిఆర్ కలిసి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్దాపూర్‌లో అగ్రికల్చర్ కళాశాలకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతి వ్యక్తి అభివృద్ధి కోసం సర్కార్ కార్యక్రమాలను రూపొందిస్తుందని చెప్పారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ కల అని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కెసిఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వచ్చే 6 నెలల్లో సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు రూ. 12 వేల కోట్లతో రైతుబంధు పథకం అమలు చేశామని తెలిపారు. అలాగే రైతుబీమా పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎంఎల్ఎ చెన్నమనేని రమేశ్‌తో పాటు టిఆర్ఎస్ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Related Stories: