సినీ ఫక్కీలో దోపిడీ

నార్సింగిలో నకిలీ నోట్ల ముఠా హల్‌చల్ డాలర్ల వ్యాపారికి కుచ్చుటోపీ తుపాకీ చూపిస్తూ హెచ్చరికలు 37 వేల డాలర్లతో ఉడాయింపు మన తెలంగాణ/సిటీబ్యూరో : అది ఔటర్ రిం గ్ రోడ్ టిఎస్‌పిఏ కూడలి. సాయంత్రం 4.30 గం.లు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. అక్కడ అప్పటికే మరో ఇద్దరు వ్యక్తులున్నారు. కారులో నుండి దిగిన ఓ వ్యక్తి తన బ్యాగులో తీసుకువచ్చిన 37000 డాలర్లున్న బ్యాగ్‌ను తనతో కారులో వచ్చిన వ్యక్తికిచ్చి అతడి నుండి రూ. 24 […]

నార్సింగిలో నకిలీ నోట్ల ముఠా హల్‌చల్
డాలర్ల వ్యాపారికి కుచ్చుటోపీ
తుపాకీ చూపిస్తూ హెచ్చరికలు
37 వేల డాలర్లతో ఉడాయింపు

మన తెలంగాణ/సిటీబ్యూరో : అది ఔటర్ రిం గ్ రోడ్ టిఎస్‌పిఏ కూడలి. సాయంత్రం 4.30 గం.లు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. అక్కడ అప్పటికే మరో ఇద్దరు వ్యక్తులున్నారు. కారులో నుండి దిగిన ఓ వ్యక్తి తన బ్యాగులో తీసుకువచ్చిన 37000 డాలర్లున్న బ్యాగ్‌ను తనతో కారులో వచ్చిన వ్యక్తికిచ్చి అతడి నుండి రూ. 24 లక్షలున్న బ్యాగును తను తీసుకున్నాడు. బ్యాగులు మార్చుకున్న వారిలో డాలర్లు ఇచ్చినతను బ్యాగ్‌లో ఉన్న నగదును చూస్తుండగా కారులోని వ్యక్తి తుపాకీని చూపిస్తూ… ఇవన్నీ ఇక్కడ చూడకూడదు. ఇంటికెళ్ళి చూసుకో అంటూ హెచ్‌చరిస్తూనే కారులో పరారయ్యాడు. తుపాకీ చూపించే సరికి బాధితుడు నిశ్చేష్ఠుడిగా నిలిచిపోయాడు. ఇది గురువారం నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో పక్కా సినీ ఫక్కీలో జరిగిన దోపిడీ. అమెరికా డాలర్లు తీసుకుని, నకిలీ నోట్లు అందజేసిన నకిలీ నోట్ల ముఠా తుపాకీతో హల్‌చల్ చేయడం నగరంలో తీవ్రకలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆరాంఘర్ ప్రాంతానికి చెందిన మోయిన్‌కు పరిచయమయ్యాడు. తనకు యుఎస్ డాలర్లు కావాలని, అందుకు మార్కెట్ ధరకన్నా మరో నాలుగు రూపాయలను అదనంగా ఇచ్చి తీసుకుంటానని చెప్పాడు. దీంతో మోయిన్‌కు తెలిసిన వ్యక్తి రఫీక్ వద్దకు ఆ గుర్తుతెలియని వ్యక్తిని తీసుకెళ్ళాడు. శంషాబాద్‌లో రఫీక్ వద్ద ఉన్న 17 డాలర్లు తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తి డాలర్‌కు రూ. 74లుగా చెల్లించాడు. అదే వ్యక్తి మరో మారు రఫీక్‌ను కలిసి తనకు 37000 డాలర్లు కావాలని కోరాడు. దీంతో రఫీక్ తనకు తెలిసిన జాఫర్‌కు ఈ విషయం తెలిపాడు. అనంతరం రఫీక్, జాఫర్‌లు కలిసి గచ్చిబౌలిలోని కాఫీడే వద్దకు రావాల్సిందిగా కోరాడు. జాఫర్ 37000 డాలర్లును తీసుకుని కాఫీడేకు వచ్చాడు. అక్కడే ఉన్న గుర్తుతెలియని వ్యక్తి జాఫర్‌ను కలిసి తన మిత్రుడు టిఎస్‌ఎపి కూడలి వద్ద ఉన్నాడని అక్కడకు వెళ్దామని కారులో బయలుదేరారు. అయితే, టిఎస్‌ఎపి కూడలిలో కారు దిగి జాఫర్ వద్ద ఉన్న డాలర్తు తీసుకుని, ఇండియా నగదున్న బ్యాగ్‌ను జాఫర్‌కు అందజేశాడు. అయితే, బ్యాగ్‌లు ఉన్నది నకిలీదా అసలునోట్లానని గమనిస్తుండగానే గుర్తు తెలియని వ్యక్తి తన వద్దనున్న తుపాకీ తీసి హెచ్చరించి పారిపోయాడు. దీంతో ఏమిచేసేది లేక నేరుగా నా ర్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెంకటేశ్వర్‌రావు తెలిపారు. సిసిటివి ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తిస్తున్నామని తెలిపారు.

Related Stories: