సిద్ధూ శాంతి దూత: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: వివాదంలో చిక్కుకున్న నవజోత్ సింగ్ సిద్ధూను పాకిస్థాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం సమర్థించారు. పంజాబ్ మంత్రి అయిన నవజోత్ సింగ్‌ను విమర్శిస్తున్న వారు భారత ఉపఖండంలో శాంతిక విఘాతం కలిగిస్తున్నారు. సిద్ధూ విలేకరుల సమావేశానంతరం ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా ప్రతిస్పందించారు. ‘నా ప్రమాణస్వీకారానికి వచ్చిన సిద్ధూకు నా కృతజ్ఞతలు. ఆయన శాంతి దూత. ఆయనకు పాకిస్థాన్‌లో ప్రజలు ప్రేమానురాగాలు పంచారు’ అని తన ట్వీట్‌లో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ‘ఉపఖండంలో ప్రజల […]

ఇస్లామాబాద్: వివాదంలో చిక్కుకున్న నవజోత్ సింగ్ సిద్ధూను పాకిస్థాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం సమర్థించారు. పంజాబ్ మంత్రి అయిన నవజోత్ సింగ్‌ను విమర్శిస్తున్న వారు భారత ఉపఖండంలో శాంతిక విఘాతం కలిగిస్తున్నారు. సిద్ధూ విలేకరుల సమావేశానంతరం ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా ప్రతిస్పందించారు. ‘నా ప్రమాణస్వీకారానికి వచ్చిన సిద్ధూకు నా కృతజ్ఞతలు. ఆయన శాంతి దూత. ఆయనకు పాకిస్థాన్‌లో ప్రజలు ప్రేమానురాగాలు పంచారు’ అని తన ట్వీట్‌లో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ‘ఉపఖండంలో ప్రజల అభ్యున్నతికి, పేదరిక నిర్మూలనకు చర్చల ద్వారా అభిప్రాయభేదాలను తొలగించుకోవాలి, వాణిజ్యాన్ని మొదలెట్టాలి’ అని కూడా ఇమ్రాన్ తెలిపారు.

ఆ ఆలింగనం భావోద్వేగ క్షణంలోది: సిద్ధూ

చండీగఢ్: పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి ఆగస్టు 18న హాజరై విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ మంగళవారం స్పందించారు. ‘నేను కొన్ని రోజులు పాకిస్థాన్ వెళ్లినందుకే చర్చనీయాంశం అయింది. ఈ విషయంలో నేను కొన్ని విషయాలు స్పష్టం చేయదలచుకున్నాను. పాకిస్థాన్‌కు నా ప్రయాణం రాజకీయమైనది కాదు. మిత్రుడు ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం మేరకు నేను ఆయన ప్రమాణస్వీకారానికి వెళ్ళాను. ఆ మిత్రుడు ఎంతో కష్టపడి, జీవితంలో ఎంతో సంఘర్షించి గౌరవనీయ స్థానానికి చేరుకున్నాడు. కోట్లాది మంది జీవితాలను మార్చగల సామర్థం ఆ స్థానానికి ఉంది. ప్రమాణస్వీకారోత్సవానికి జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా కూడా హాజరయ్యారు.

బిజెపి విమర్శలు

నవజోత్ సింగ్ సిద్ధూ చేష్టలను బిజెపి ఎంపి, ఢిల్లీ బిజెపి విభాగం అధ్యక్షుడు మనోజ్ తివారి మంగళవారం విమర్శించారు.‘పాకిస్థాన్‌కు ఆయన వెళ్లడంలో బిజెపికి సమస్య ఏదీ లేదు. కానీ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడి పక్క సీటులో కూర్చోడం, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వాను ఆలింగనం చేసుకున్నారు.

Related Stories: