సిద్దిపేటలో చేతక్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Chetak Helicopter Emergency Landing in Siddipet

సిద్దిపేట : హైదరాబాద్‌లోని హకీంపేట బేస్ క్యాంపు నుంచి శిక్షణ కోసం బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేతక్ హెలికాప్టర్ సిద్దిపేటలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లనే పైలట్  సిద్దిపేట సమీపంలోని పంటపొలాల్లో ల్యాండ్ చేశాడు. ఈ హెలికాప్టర్‌ను తరుచూ శిక్షణ కోసం ఉపయోగిస్తున్నట్టు ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. హెలికాప్టర్ ల్యాండైన ప్రాంతాన్ని అధికారులు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

Chetak Helicopter Emergency Landing in Siddipet

Comments

comments