సిద్దిపేటకు పోలీసు బెటాలియన్

Minister Harish Rao Comments on Farmers

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో జనభా పెరగడంతో స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.  9వ బెటాలియన్ కు రూ. 93.25 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయడంతోనే జిల్లా పోలీస్ ఏర్పాటు చేసుకున్నామని కొనియాడారు. సిద్దిపేటలో ఇప్పటికే పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేసుకొని నిఘా వ్యవస్థను పటిష్ట  చేసుకునేందుకు కృషి చేద్దామని వివరించారు. అన్ని కమిషనరేట్ లకు ఆదర్శంగా సిద్దిపేట కమిషనరేట్ ఉండాలని పోలీసులకు సూచించారు. కమిషనరేట్ ఏర్పాటు చేయడం వలన యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.  ఈ బెటాలియన్ ఏర్పాటుకు గతంలో అక్కన్నపేట, చేర్యాల ప్రాంతాల్లో స్థల పరిశీలించామని, త్వరలో స్థలం పైనల్ చేసి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

Comments

comments