సిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతాం

తక్కువ జనాభా గల స్మార్ట్ సిటీ కరీం“నగరం” 500 కోట్లతో మానేర్ రివర్ ఫ్రంట్ విద్యారంగంలో నగరం ముందుకు ప్రధాన కూడళ్ళ ఆధునీకరణ పనులు స్మార్ట్ సిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపి వినోద్ కుమార్ మతెలంగాణ/కరీంనగర్‌టౌన్: కరీంనగర్ స్మార్ట్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతామని కరీంనగర్ పార్లమెంట్ స భ్యులు బి.వినోద్‌కుమార్ అన్నారు. శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్మార్ట్ సిటీ కార్యాలయాన్ని ఎంపి ప్రారంభించారు. అనంతరం ఎంపి మాట్లాడుతూ ప్రపం చంలోనే అతి తక్కువ జనాభా […]

తక్కువ జనాభా గల స్మార్ట్ సిటీ కరీం“నగరం”
500 కోట్లతో మానేర్ రివర్ ఫ్రంట్
విద్యారంగంలో నగరం ముందుకు
ప్రధాన కూడళ్ళ ఆధునీకరణ పనులు
స్మార్ట్ సిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపి వినోద్ కుమార్

మతెలంగాణ/కరీంనగర్‌టౌన్: కరీంనగర్ స్మార్ట్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతామని కరీంనగర్ పార్లమెంట్ స భ్యులు బి.వినోద్‌కుమార్ అన్నారు. శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్మార్ట్ సిటీ కార్యాలయాన్ని ఎంపి ప్రారంభించారు. అనంతరం ఎంపి మాట్లాడుతూ ప్రపం చంలోనే అతి తక్కువ జనాభా గల నగరం స్మార్ట్ సిటీగా ఎంపికైన నగరం కరీంనగర్ అని తెలిపారు. కేంద్ర ప్ర భు త్వం ద్వారా స్మార్ట్ సిటీ అభివృద్ధికి రానున్న 5 సంవ త్సరాల కాలంలో 1000కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. తెలం గాణ రాష్ట్రంలో రెండు నగరాలు స్మార్ట్ సిటీలుగా ఎంపికై నాయని అందులో వరంగల్, కరీంనగర్ ఉండగా వరంగల్ స్మార్ట్ సిటీకు దీటుగా కరీంనగర్ స్మార్ట్ సిటి పనులకు టె ండర్లను పిలవడం జరిగిందని తెలిపారు.
నగరంలో రోడ్ల అభివృద్ధి పనులు పార్కుల ఏర్పాటు చే యడం జరుగుతుందని తెలిపారు.నగరంలోని పిల్లల ఆట ల కోసం కొత్త పార్కుల ఏర్పాటు సర్కస్ గ్రౌండ్‌లో ఆహ్లాద కరమైన వాతావరణం కల్పించుటకు పార్కును ఏర్పాటు చే స్తున్నామని తెలిపారు.ట్రాఫిక్ నియంత్రణ కొరకు ట్రాఫిక్ సిగ్నల్స్, ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.కరీంనగర్ నడ్డి బొ డ్డున 150 అడుగుల ఎత్తున జాతీయ జెండాను ఎగురవేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదేవిధంగా నగరా నికి వన్నె తెచ్చే విధంగా కేబుల్ బ్రిడ్జిని నిర్మాణాన్ని టాటా కన్స్‌ల్ టెన్సీ ద్వారా నిర్మిస్తున్నామని తెలిపారు. 500 కో ట్ల రూపాయలతో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేపడు తున్నామని జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరు చుటకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క రీంనగర్ స్మార్ట్ సిటీ రావటంతో జిల్లాకు ప్లానిటోరియం, సైన్స్ సెంటర్, టూరిస్ట్ హోటల్, కేబుల్ బ్రిడ్జి లాంటివి వ చ్చాయన్నారు.ఐటి హబ్‌కు కూడా శంకుస్థాపన చేయడం జరిగిందని, నగరంలోని ప్రజలకు వెజ్, నాన్  వెజ్ మార్కెట్లు ఏర్పాటుకు త్వరలో టెండర్లు పి లుస్తామని అన్నారు. కరీంనగర్ నాలుగు జాతీయ రహదారులకు కనెక్టివిటి త్వరలో కాబోతుందని తెలిపారు. కరీంనగర్-హైదరాబాద్, కరీంనగర్-కాజీపేట వరకు రైల్ వే లైన్లు ఏ ర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. నగరంలో పలు చో ట్ల జంక్షన్లు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కరీంనగర్‌కు విద్యారంగంలో ముందుంకు దుసుకువెళ్లుటకు ట్రిపుల్ ఐటి కోసం కేంద్రంలో చర్చించామని తెలిపారు. కరీంనగర్ నగర ప్రజలు ప్రభుత్వం పై ఉంచిన వి శ్వాసంతో నగర అభివృద్దికి ఆహర్నిషలు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. స్మార్ట్ సిటి నిర్మాణంలో అభివృద్ధి పనులలో ప్రజలందరు భాగస్వాములై సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కరీంనగర్ శాసన సభ్యులు గం గుల కమలాకర్ మాట్లాడుతూ 250 కోట్ల అభివృద్ది పనుల కు టెండర్లు పిలవటం జరిగిందని నగరంలో స్మార్ట్ సిటి, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది పనులు జరుగుతున్నాయని కొం చె ం ఆలస్యమైన ప్రణాళికబద్దంగా జరుగుతున్నాయని అ న్నా రు. కరీంనగర్ సిటి మెయిన్ రోడ్డును బ్రహ్మండంగా తీ ర్చిదిద్దుతామని అన్నారు. నగర అభివృధ్ధికి ప్రజలందరు స హకరించాలని కోరారు. ఈ సందర్భంగా నగర మేయర్ ర వీందర్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే బ్రహ్మండమైన నగరంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ కాబోతుందన్నారు. రాబోయే రోజులలో రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు నెరవేరుతాయన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగర పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి, నగర పా లకసంస్థకమీషనర్,కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: