సిటిజన్స్ లిస్టు నుంచి 40 లక్షల మందిని తొలగింపు…

న్యూఢిల్లీ: అస్సోంలో సుమారుగా 40 లక్షల మంది పౌరులు చట్ట విరుద్ధంగా ఉంటున్నారని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తుది ముసాయిదాను ఇవాళ రిలీజ్ చేశారు. ఆ రిజిస్టర్‌లో రాష్ర్టానికి చెందిన మొత్తం 40 లక్షల మంది పేర్లను తొలిగించారు. జాబితా నుంచి తొలిగించిన వారిని విదేశీయులుగా పరిగణించరు అని, వాళ్లపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు. పేరు లేని వారు ఎన్‌ఆర్‌సి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అంశంపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ స్పందించారు. […]

న్యూఢిల్లీ: అస్సోంలో సుమారుగా 40 లక్షల మంది పౌరులు చట్ట విరుద్ధంగా ఉంటున్నారని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తుది ముసాయిదాను ఇవాళ రిలీజ్ చేశారు. ఆ రిజిస్టర్‌లో రాష్ర్టానికి చెందిన మొత్తం 40 లక్షల మంది పేర్లను తొలిగించారు. జాబితా నుంచి తొలిగించిన వారిని విదేశీయులుగా పరిగణించరు అని, వాళ్లపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు. పేరు లేని వారు ఎన్‌ఆర్‌సి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అంశంపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ స్పందించారు. కొందరు అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారని అన్నారు. ఇది అసంబద్ధ రిపోర్ట్ అని ఆయన అన్నారు. ఎన్‌ఆర్‌సి జాబితాపై అస్సోం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. సిటిజన్స్ లిస్టు నుంచి 40 లక్షల మందిని తొలగించడం ఆశ్చర్యకరంగా ఉందని కాంగ్రెస్ చీఫ్ బిపునా బోరా విమర్శించారు.

Related Stories: