సిఎం సహాయనిధితో ఆదుకుంటాం

మన తెలంగాణ/వనపర్తి రూరల్: సిఎం సహాయనిధి పేదల కుటుంబాలకు  ఒక వరమని, సింఎం సహాయ నిధితో పేద కుటుంబాలను ఆదుకుంటామని  ఎంఎల్‌ఎ డా. జి.చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని 11వ వార్డుకు చెందిన రాజేష్  బాధిత కుటుంబాలకు సిఎం సహాయనిధి రూ. 46 వేలు చెక్కును ఎంఎల్‌ఎ డా. జి.చిన్నారెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లా డుతూ సిఎం సహాయనిధి సాయంతో పేద కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. కార్పొరేట్ వైద్యం అందించేం […]

మన తెలంగాణ/వనపర్తి రూరల్: సిఎం సహాయనిధి పేదల కుటుంబాలకు  ఒక వరమని, సింఎం సహాయ నిధితో పేద కుటుంబాలను ఆదుకుంటామని  ఎంఎల్‌ఎ డా. జి.చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని 11వ వార్డుకు చెందిన రాజేష్  బాధిత కుటుంబాలకు సిఎం సహాయనిధి రూ. 46 వేలు చెక్కును ఎంఎల్‌ఎ డా. జి.చిన్నారెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లా డుతూ సిఎం సహాయనిధి సాయంతో పేద కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. కార్పొరేట్ వైద్యం అందించేం దుకు సిఎం సహాయనిధి ఉపయోగపడుతుందన్నారు. సిఎం సహాయనిధి  మంజూరు కోసం తనవంతు కృషి చేస్తానని బాధితులకు ఎంఎల్‌ఎ భరోసానిచ్చారు.  పిసిసి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, డిసిసి అధ్యక్షులు శంకర్ ప్రసాద్, కోట్ల రవి ,  డిసిసి ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మీ, కాంగ్రెస్ పట్టణ కార్యదర్శి కిరణ్ కుమార్, నాగన్న యాదవ్, బ్రహ్మం, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Comments

comments

Related Stories: