సిఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన సభాపతి

మన తెలంగాణ/ఘణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘణపురం వద్ద ముఖ్యమంత్రి పర్యటించనున్న దృష్టా మంగళవారం సభాపతి సిరికొండ మధుసూధనాచారి సభాస్థలిని పరిళశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిషౠ్టత్మకంగా తీసుకుని నాలుగో విడత హరితహారాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్కడి నుంచే ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మంకంగా తీసుకుని చేపట్టిన హరితహారంలో ఇప్పటి వరకు మూడు విడతల్లో రాష్ట్రంలో 40కోట్ల మొక్కలను నాటినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే ప్రదేశాన్ని […]

మన తెలంగాణ/ఘణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘణపురం వద్ద ముఖ్యమంత్రి పర్యటించనున్న దృష్టా మంగళవారం సభాపతి సిరికొండ మధుసూధనాచారి సభాస్థలిని పరిళశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిషౠ్టత్మకంగా తీసుకుని నాలుగో విడత హరితహారాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్కడి నుంచే ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మంకంగా తీసుకుని చేపట్టిన హరితహారంలో ఇప్పటి వరకు మూడు విడతల్లో రాష్ట్రంలో 40కోట్ల మొక్కలను నాటినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించి సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శివశంకర్‌గౌడ్,  సర్పంచ్, శ్రీనివాస్, నాయకులు దేవిప్రసాద్, కుమారస్వామి, రత్నం, రవి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments