సిఎం కెసిఆర్ ప్రధాని కావాల‌ని బైక్‌యాత్ర…

Bike Rally CM wants to become Prime Minister

రాజన్న సిరిసిల్ల:  ప్రజా సంక్షేమ పథకాల అమలులో భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నసిఎం కెసిఆర్ ప్రధాని కావాలని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన  శ్రీరామోజు ఆంజనేయులు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆంజనేయులు జూలై 18వ తారీఖున ఆదిలాబాద్ నుంచి బైక్‌యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకోగా టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ సారధ్యంలో స్థానిక నేతలు ఘనస్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడారు. సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడీకి గురైందని చెప్పారు. తెలంగాణ దశ, దిశ మార్చాలన్న సంకల్పంతో  కెసిఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్నిసాధించారని కొనియాడారు. టిఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా అద్భుతమైన పాలననందిస్తూ ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజావసరాలు తెలిసిన వ్యక్తి ప్రధాన మంత్రి అయితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలందరూ సిఎం కెసిఆర్‌కు అండగా నిలిచి భారత ప్రధానిని చేయాలని ఆయన ఆకాంక్షించారు.