సిఎం కెసిఆర్ తో సిఎస్ భేటీ…

హైదరాబాద్: శాసనసభ రద్దుపై ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో రేపటి తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికల కసరత్తులో భాగంగా శాసనసభ రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు ఉదయం జరిగే మంత్రివర్గం సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం మంత్రులందరూ హైదరాబాద్ లో ఉండాలని సిఎం కార్యాలయం నుంచి మంత్రులకు సమాచారం అందింది.  […]

హైదరాబాద్: శాసనసభ రద్దుపై ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో రేపటి తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికల కసరత్తులో భాగంగా శాసనసభ రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు ఉదయం జరిగే మంత్రివర్గం సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం మంత్రులందరూ హైదరాబాద్ లో ఉండాలని సిఎం కార్యాలయం నుంచి మంత్రులకు సమాచారం అందింది.  సిఎం కెసిఆర్ ఇవాళ సాయంత్రం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రం నుంచి ప్రగతి భవన్‌కు చేరుకున్న వెంటనే సిఎస్‌, ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, ఇతర ఉన్నతాధికారులకు సమాచారం పంపారు. ప్రగతి భవన్‌కు చేరుకున్న సిఎస్‌తో పాటు ఉన్నతాధికారులతో మంత్రివర్గ సమావేశంపై సిఎం కెసిఆర్  చర్చిస్తున్నట్లు సమాచారం.

Comments

comments

Related Stories: