సిఎం కెసిఅర్ కృషి ఫలితమే తెలంగాణకు ఎయిమ్స్…

Mp Boora Narsaiah Goud
బీబీనగర్ : తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కెసిఅర్ కృషి ఫలితంగానే తెలంగాణలో ఎయిమ్స్ సాధ్యమైంది అని భువనగిరి పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రంగాపురం నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏమ్మేల్సీ ఎలిమినేటి క్రిష్ణ రెడ్డితో కలిసి మాట్లాడారు. బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి ఎయిమ్స్(అల్ ఇండియా మెడుకల్ సైన్సెస్) గా మారడం, అది నేను ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్‌లోనే అమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఎయిమ్స్ సాధనలో తెలంగాణ రాష్ట్ర ఎంపీల సమిష్టి కృషి ఉందని తెలిపారు.2009,2014లలో డాక్టర్ జెఏసి అధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసా ఇప్పుడు ఎయిమ్స్ ఆసుపత్రి నేను ఎంపీగా ఉన్నప్ఫుడు మంజూరు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు.

2012లో దేశ వ్యాప్తంగా అరు ఎయిమ్స్‌లు అమోదించిన కేంద్రం మన రాష్ట్రానికి ఎయిమ్స్ రాకపోవడానికి అప్పటి పాలకుల నిర్లక్ష్యమేనని విమర్శించారు. ఎయిమ్స్ రావడానికి కృషి చెసిన కేంద్ర అరోగ్య శాఖ మంత్రి జేపి నడ్డా,రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఅర్, కేంద్ర ప్రభుత్వం తరుపున రాష్ట్రానికి వచ్చిన ఎయిమ్స్ బృందం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బీబీనగర్ నిమ్స్ రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు పెద్ద ఆసుపత్రిగా మారుతుంది అనుకున్నాం. కాని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్(అల్ ఇండియా మెడుకల్ సైన్సెస్) ఆసుపత్రి జిల్లాకు రావడంతో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవాలతో పాటు స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశలతో పాటు ఈ ప్రాంతం మంరింత అభివృధ్ది చెందుతుందని ఆయన తెలిపారు. ఎమ్‌ఎల్‌సి క్రిష్ణ రెడ్డి మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వంలో అరోగ్య శాఖ అధికారుల నుండి అనుమతులు మంజురు చేయడంలో ఎంపి కృషి చెప్పలేనిదని డాక్టర్ కావడం వళ్లనే సాధ్యమైంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మేన్  ఫంథు నాయక్ గ్రంథలయ కమిటి చైర్మేన్ జడల అమరేంధర్ గౌడ్,రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొల్ఫుల అమరేంధర్,తెరాస మండల అధ్యక్ష కార్యదర్శులు పిట్టల అశోక్.పంజాల సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments