సిఎంగా కెసిఆర్ మరి పదిహేనేళ్లు

 ఎన్నికల వాతావరణం వచ్చేసింది  గాలి హామీలిచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి టిఆర్‌ఎస్‌లో వైశ్య ప్రముఖుల చేరిక సందర్భంగా మంత్రి కెటిఆర్   మన తెలంగాణ/ హైదరాబాద్: మరో 15 ఏళ్ల పాటు టిఆర్‌ఎస్ ప్రభుత్వం, సిఎంగా కెసిఆర్ ఉం టారని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఇప్పటికే ఎన్నికల వాతావర ణం వచ్చిందని, గాలిమాటలు వినిపిస్తాయని, నోటికి ఏదొస్తే అది మాట్లాడే నాయకులు వస్తార ని, అవసరమైతే ఇంటికి ఒక తులం బంగారు కూడా […]

 ఎన్నికల వాతావరణం వచ్చేసింది 

గాలి హామీలిచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

టిఆర్‌ఎస్‌లో వైశ్య ప్రముఖుల చేరిక సందర్భంగా మంత్రి కెటిఆర్  

మన తెలంగాణ/ హైదరాబాద్: మరో 15 ఏళ్ల పాటు టిఆర్‌ఎస్ ప్రభుత్వం, సిఎంగా కెసిఆర్ ఉం టారని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఇప్పటికే ఎన్నికల వాతావర ణం వచ్చిందని, గాలిమాటలు వినిపిస్తాయని, నోటికి ఏదొస్తే అది మాట్లాడే నాయకులు వస్తార ని, అవసరమైతే ఇంటికి ఒక తులం బంగారు కూడా ఇస్తామంటారని ఎద్దేవా చేశారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ బస్సుయాత్ర, బిజెపి జన చైతన్య యాత్రల పట్ల ఒక కంట కనిపెట్టాలన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమభరత్, నాయకులు బొగ్గారపు దయానంద్ ఆధ్వర్యంలో పలువురు వైశ్య ప్రముఖులు మంత్రి కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మమమూద్‌అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపి మల్లారెడ్డి, ఎంఎల్‌ఎలు ఎ.జీవన్‌రెడ్డి, తీగల కృష్ణా రెడ్డి, కొండాసురేఖ, మధు గుప్తా, రెడ్యానాయక్, మేయర్ బొంతు రామ్మోహన్, టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమభరత్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డలను చంపిన కాంగ్రెస్ ఇప్పుడు నీతులు చెబుతుందని, దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.దశాబ్దాల పాటు దగా చేసి, నయవంచన చేసిన కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. ఆంధ్ర, తెలంగాణకు బలవంతపు వివాహం చేశానని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ముత్తాత నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఇవాళ ఇన్ని సమస్యలు ఉండేవి కావన్నారు. కాంగ్రెస్ హయాంలో తమకు చందమామను అప్పగిచేస్తే దానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం మసి పూసిన చందంగా కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇన్నేళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు దేశంలో రహదారులు, కనీసం విద్యుత్ లేని వేలాది గ్రామాలు ఉన్నాయన్నారు. మరుగుదొడ్డి కోసం ప్రధానమంత్రి ప్రచారం చేస్తున్నారంటేనే కాంగ్రెస్ హయంలో దేశం ఎంత అధోగతి పాలైందన్నారు. దుష్పరిపాలన వల్లనే దేశం ఈ పరిస్థితికి వచ్చిందన్నారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించడం పక్కా అని అన్నారు.
జనాలను చైతన్యం చేస్తానని బిజెపి యాత్ర చేపట్టిందని, ఇప్పటికే ప్రజలు చైతన్యంగానే ఉన్నారని, ఈసారి వారి వీపులు పగలగొడుతారన్నారు. సొంత నియోజకవర్గాల్లోనే ఏం సాధించలేని బిజెపి నేతలు ఇక రాష్ట్రంలో ఏం సాధిస్తారని, బిజెపిని ఓడించేందుకు ప్రజలు పూర్తి చైతన్యంతోనే ఉన్నారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున మంచిపనులు చూసి కాంగ్రెస్ వశమవడం లేదన్నారు.
ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ నేతలు పరేషాన్‌లో ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్, టిడిపి లూటీ చేశారని, సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ మీరు(ఆర్యవైశ్యులు) తమ వెంట ఉంటే కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేస్తామన్నారు. ప్రధాని మోడీ గ్రాఫ్ పడిపోతుందని, జన చైతన్య యాత్ర పేరుతో గడిని గండికొడుతామని చెబుతున్న బిజెపి నేత లక్ష్మణ్, ముందు ఢిల్లీకి గండిపడుతోందని, దానిని చూసుకోవాలన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ మధ్యనే కొంత మంది కొత్త బిచ్చగాళ్లు యాత్రల పేరుతో ప్రజలను కలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలించిన తరహా లోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా పాలించాలని భావిస్తున్నదని, అలా చేయబోమన్నారు. తమ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు తగిన న్యాయం చేస్తుందన్నారు.
టిఆర్‌ఎస్‌లో చేరిన వైశ్యప్రముఖులు వీరే : గౌరిశెట్టి ప్రభాకర్, చక్కిలం రమణయ్య, అడ్డా శ్రీనివాస్, ముర్రంశెట్టి శ్రీనివాస్, ఎన్.మురళీకృష్ణ,కాశెట్టి పాండుగుప్త, చిద్దర నాగేందర్, వనం యాదయ్య, ఇమ్మడి శివకుమార్ గుప్తా, జులూరి స్వరూపారాణి, లింగా ప్రకాష్, వటుకురి శ్రీనివాస్ గుప్త, నందగోపాల్, సిఎ.బిజినేపల్లి చక్రపాణి, కాశెట్టి నాగేశ్, బిజ్జల శ్రీనివాస్, అల్లాడి సుధాకర్, బొడ్ల నర్సింగరావు, మ్యాడం అశోక్, దాచేపల్లి బిక్షపతి, సింగారపు సతీష్, బొగ్గారపు శరత్‌చంద్ర, డాక్టర్, సరబు ఆనందం, బొగ్గారపు వరుణ్ చంద్ర, గిన్నం వేణు, చింతల శ్రీనివాస్, టి.పూర్ణచంద్ర తదితరులు పెద్ద సంఖ్యలో చేరారు.

Comments

comments

Related Stories: