సిండికేట్ బ్యాంకు సేవలపై అవగాహన

మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని సిండికేట్ బ్యాంకు సీనియర్ మేనేజర్ రాఘవేందర్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాదారులకు, జనాలకు బ్యాంకు అందిస్తున్న సేవలపై గురువారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిండ్ అనుసంధాన మరియు కరెంట్‌ అకౌంట్ సేవింగ్ అకౌంట్(కాసా) పేరుతో సిండికేట్ బ్యాంకులో ఖాతాదారులుగా మారితే కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అటల్ పించన్ యోజన, ప్రధానమంత్రి ఉపాధిహామీ యోజన ముద్ర లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను జనాలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళా గ్రూపులకు […]


మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని సిండికేట్ బ్యాంకు సీనియర్ మేనేజర్ రాఘవేందర్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాదారులకు, జనాలకు బ్యాంకు అందిస్తున్న సేవలపై గురువారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిండ్ అనుసంధాన మరియు కరెంట్‌ అకౌంట్ సేవింగ్ అకౌంట్(కాసా) పేరుతో సిండికేట్ బ్యాంకులో ఖాతాదారులుగా మారితే కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అటల్ పించన్ యోజన, ప్రధానమంత్రి ఉపాధిహామీ యోజన ముద్ర లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను జనాలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళా గ్రూపులకు రూ.23 లక్షల రణాలు, ఇద్దరికి రూ.18లక్షలతో గృహ రుణాలు, 30లక్షల విద్యారుణాలు, వాహన రుణాన్ని అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది అరుణ, సోనిమార్టిన, రేణుక, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related Stories: