సింగరేణి సిఎండికి అవుట్ స్టాడింగ్ లీడర్‌షిప్ ఆవార్డు

మణుగూరు: సిరులగని సింగరేణి సిఎండి శ్రీధర్‌ దుబాయ్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ స్టడీస్ వారి అవుట్ స్టాడింగ్ లీడర్‌షిప్ ఆవార్డును అందుకున్నారు. ప్రముఖ ఆర్థికాంశాల అధ్యయన సంస్ధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ స్టడీస్ వారు అంతర్జాతీయస్ధాయిలో అసాధారణ నాయకత్వ ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే అవుట్ స్టాడింగ్ లీడరషిప్ ఆవార్డును గురువారం రాత్రి దుబాయ్‌లో జరిగిన గ్లోబుల్ ఎకనమిక్ సమిట్‌లో సింగరేణి సిఎండి శ్రీధర్‌కు బహుకరించారు. యునెటేడ్ ఆరబ్ ఎమిరేట్స్ రాజవంశ ప్రముఖుల నుండి ఈ ఆవార్డును అందుకున్నారు. […]

మణుగూరు: సిరులగని సింగరేణి సిఎండి శ్రీధర్‌ దుబాయ్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ స్టడీస్ వారి అవుట్ స్టాడింగ్ లీడర్‌షిప్ ఆవార్డును అందుకున్నారు. ప్రముఖ ఆర్థికాంశాల అధ్యయన సంస్ధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ స్టడీస్ వారు అంతర్జాతీయస్ధాయిలో అసాధారణ నాయకత్వ ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే అవుట్ స్టాడింగ్ లీడరషిప్ ఆవార్డును గురువారం రాత్రి దుబాయ్‌లో జరిగిన గ్లోబుల్ ఎకనమిక్ సమిట్‌లో సింగరేణి సిఎండి శ్రీధర్‌కు బహుకరించారు. యునెటేడ్ ఆరబ్ ఎమిరేట్స్ రాజవంశ ప్రముఖుల నుండి ఈ ఆవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అసాధారణ నాయకత్వ ప్రతిభ పాటవాలతో అంతర్జాతీయ స్ధాయి ప్రమాణాలకు నెలకొల్పుతున్న ముఖ్య కార్యనిర్విహాకులకు గత కొంత కాలంగా ప్రతీ ఎడాది ఈ అవార్డును బహుకరిస్తున్నారు. సింగరేణి సంస్ధను గత నాల్గు సంవత్సరాల కాలంలో అత్యధిక వృద్ధిరేటుతో అభివృద్ధిపరుస్తూ అర్ధికంగా పతిష్ట పరచడంలో తన ప్రతిభ చూపిన సిఎండి శ్రీధర్ సేవలకు గుర్తింపుగా ఈ ఎడాది ఈ అవార్డును అందజేస్తునట్టు నిర్వాహకులు తెలియజేశారు. అవార్డును స్వీకరించిన సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ దిశ నిర్ధేశంలో సింగరేణి సంస్ధ గతంలో ఎన్నడు సాధించని ప్రగతిని నమోదు చేసిందని, సింగరేణి సాధించిన ప్రతిభ దేశవ్యాప్తంగానే కాకుండ అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు పోందుతుందని అన్నారు.

Related Stories: