సింగరేణికి కార్మికులే ఆస్తి

MDT Meetings for annual goals

వార్షిక లక్ష్యాల కోసం ఎండిటి సమావేశాలు
జిఎం సుభాని

మన తెలంగాణ/నస్పూర్:  తెలంగాణ రాష్ట్రంలో సింగరేణికి ఒక ప్రత్యే క స్థానం ఉందని, అంతే  కాకుండా రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమ కుడా సింగరేణికి ప్రత్యేక ఆస్తి అంటూ ఏమిలేదని శ్రీరాంపూర్ జిఎం సుభాని అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సమావేశాల్లో కార్మికులుగా, అధికారులుగా, మనం ఏంచేయాలనే విషయాలను చర్చించానికే మల్టీ డిపార్ట్‌మెంట్ టీం సమావేశాలను ప్రతి గనిలోనూ ఏర్పాటు చేస్తున్నామని  తెలిపారు. ప్రతి గని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరిస్తారు ఏం చేయాలో కార్మికులందరు నిర్ణయం తీసుకోని  ఆచరిస్తారు. కార్మికులందరు కలసి పనిచేస్తే మన కంపెనీకి, మన రాష్ట్రానికి, దేశానికే కాదు, మనందరికి కూడా ఎంతో మేలు కలుగుతుందాన్నారు.  దేశంలో ఎక్కాడ లేని విధంగా మన కంసెనీలో గత కొన్నేళ్లుగా లాభాల బోనస్‌ను పంపిణీ చేస్తున్నాం, అంతెకాకుండ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కుడా ఏక్కడ రాజీ లేకుండ ముందుకెళ్తున్నామని తెలిపారు. ఉత్పత్తి లక్షాలు సాధించాలంటే ముఖ్యాంగా యంత్ర వినియోగాన్ని పెంచుకోవాల్సిఉందాని ఓ.సి గునులలో భారీ యంత్రాల వినియోగం రొజుకు సగటున 14 గంటల నుండి 18 గంటలకు పెరగాలి, భూగర్భ గనుల్లో ఎస్.డి.ఎల్., ఎల్.హెచ్.డి. యంత్రాల వినియోగం రొజుకు 9గంటల నుండి 12గంటలకు పెంచితేనే లక్షాలను సాధించే అవకాశం ఉందాన్నారు. గతంలో కార్మికులు సూచించినవిధాంగా శ్రీరాంపూర్ డివిజన్‌లో 23 ఎస్.డి.ఎల్ యంత్రాలకు గాను 06వచ్చాయని మిగితావి అగష్టు చివరి వరకు వస్తయని తెలిపారు. డివిజన్‌లో మొత్తం 68 ఎస్.డి.ఎల్ యాంత్రల వినియోగం జరుగుతుందాని, సింగరేణి లోనె యంత్రాల వినియోగంలో మనం ముందున్నామని తెలిపారు. ఎస్.డి.ఎల్ యంత్రాలు రోజుకు సగటున 150 టన్నులు వెలికి తీయాలని  మన శ్రీరాంపూర్‌లో ఎస్.అర్.పి 1-గని 162, అర్కె6-గని 155, అర్కె5-గని 147, ఎస్.అర్.పి3- గని 145, ఐకె1ఎ-గని 141, అర్కె7- గని 131, అర్కె8-గని 119 టన్నుల బోగ్గు ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. అంతెకాకుండ సింగరేణిలోనె గనుల వారిగ యంత్రాల వినియోగంలో శ్రీరాంపూర్ డివిజన్ మొదటి 08 స్థానలు మనవే అన్నారు. కార్మికులు, అధికారులు, సూపర్‌వైజరీ సిబ్బంది అందరు కలసి కట్టుగా ముందుకు పొవడంతోనె సాద్యమైందన్నారు. ఈ వార్షిక సంవత్సరంలో కుడ కలసి మేలసి పనిచేస్తు లక్షాన్ని సాదించాలని కోరారు.