సాహోలో శ్రద్ధా కపూర్..!?

Prabhas-Shraddha

బాహుబలి చిత్రం సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటించే చిత్రాలపై టాలీవుడ్ మాత్రమే కాదు భారత దేశ చలనచిత్ర అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. కాగా సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలై ఈ చిత్రం టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకోవడమే కాక.. సినిమాపై ఎన్నో అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై సర్వత్ర చర్చ మొదలైంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ తారలు దిశా పటానీ, కత్రినా కైఫ్ పేర్లు మాత్రమే కాక.. ప్రభాస్ తో మూడు సినిమాల్లో జంటగా నటించి అందరిని అకట్టుకున్న అనుష్క శెట్టి పేరు కూడా వినిపించింది

తాజాగా సాహో కోసం రామోజీ ఫిలిం సిటీలో అతి పెద్ద సెట్ ని డిజైన్ చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం కంటే ముందు కాలంలో ఉన్న విధంగా పెద్ద గుర్రాలు, బ్రిటీష్ జెండాలతో అద్దిరిపోయే సెట్ ని నిర్మించినట్టు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో సాహోలో ప్రభాస్ సరసన ఆషికి-2 చిత్రంతో అందరికి ఆకట్టుకున్న సుందరి శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రద్ధా కపూర్ ని హీరోయిన్ గా దాదాపు ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తైన నిజమవుతుందో.. లేక రూమర్ లానే మిగిలిపోతుందో వేచి చూడాల్సిందే..

The post సాహోలో శ్రద్ధా కపూర్..!? appeared first on .