సారాపై సచిన్ భావోద్వేగపు ట్వీట్…!

లండన్: భారత మాజీ క్రికెటర్, క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా గ్రాడ్యుయేషన్‌ పట్టాను అందుకున్న సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు సచిన్ భావోద్వేగపు ట్వీట్ చేశారు. శుక్రవారం లండన్‌లో సారా డాక్టర్ పట్టాను అందుకున్న తరుణంలో ట్విటర్‌లో తన అనుభూతిని పంచుకున్నారు. ‘ఇప్పుడిప్పుడే నీవు ఇంటినుంచి వెళ్లినట్టుంది. అప్పుడే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినందుకు మాకు గర్వంగా ఉంది. నీవు ఈ ప్రపంచాన్ని జయించాలని కోరుకుంటున్న’ అంటూ లిటిల్ మాస్టర్ ట్వీట్‌ చేశారు. […]

లండన్: భారత మాజీ క్రికెటర్, క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా గ్రాడ్యుయేషన్‌ పట్టాను అందుకున్న సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు సచిన్ భావోద్వేగపు ట్వీట్ చేశారు. శుక్రవారం లండన్‌లో సారా డాక్టర్ పట్టాను అందుకున్న తరుణంలో ట్విటర్‌లో తన అనుభూతిని పంచుకున్నారు. ‘ఇప్పుడిప్పుడే నీవు ఇంటినుంచి వెళ్లినట్టుంది. అప్పుడే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినందుకు మాకు గర్వంగా ఉంది. నీవు ఈ ప్రపంచాన్ని జయించాలని కోరుకుంటున్న’ అంటూ లిటిల్ మాస్టర్ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం సచిన్ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రికెట్ తర్వాత కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే సచిన్ సారా స్నాతకోత్సవ కార్యక్రమానికి సతీమణి అంజలితో కలిసి హాజరయ్యారు. ముంబయి ధీరుభాయ్‌ అంబాని ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్యనభ్యసించిన సారా లండన్‌ యూనివర్సిటీ కళాశాల నుంచి డాక్టర్ పట్టాను అందుకుంది. ఇక సచిన్ కుమారుడు అర్జున్ కూడా లండన్ లోనే క్రికెట్ లో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే.

Comments

comments