సాయంత్రం 4గంటలకు కరుణానిధి అంతిమయాత్ర

Chennai : Karunanidhi's funeral is at 6PM on Wednesdayచెన్నయ్ : తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె చీఫ్ కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌లో జరిపేందుకు మద్రాస్ హైకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఆయన అంతిమ సంస్కారం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కరుణానిధఙ పార్థివదేహాన్ని ప్రజల , ప్రముఖుల సందర్శనార్థం రాజాజీ హాల్‌లో ఉంచారు. కరుణానిధికి ప్రధాని మోడీతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్ వరకు కరుణానిధి అంతిమయాత్ర సాగనుంది. సాయంత్రం ఆరు గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Karunanidhi’s funeral is at 6PM on Wednesday

Comments

comments