సామ్ ‘యూ టర్న్’ట్రైలర్ విడుదల…

U Turn Telugu Official Trailer Released

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత వివాహం తరువాత నటించిన రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాలు హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ అక్కినేనివారి కోడలు ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సామ్ చేస్తున్న తాజా చిత్రం ‘యూ టర్న్’. ఈ మూవీ ట్రైలర్ సోమవారం విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పవన్ కుమార్ దర్శకుడు. కన్నడ చిత్రానికి రీమేక్ గా సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ మూవీకి స్వయంగా సామ్ డబ్బింగ్ చెప్పుకుంది. ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో భూమిక, అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నారు. సెప్టెంబర్ 13న తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

Comments

comments