సామ్రాట్ అంటే ఇష్టమే.. అలాగని…!

Actress Tejaswi talks about relationship with Samrat

ప్రస్తుతం నలుగురు ఒక చోట కలిస్తే వారు ముఖ్యంగా మాట్లాడుకునే టాపిక్ బిగ్‌బాస్ 2. షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలుసుకోడానికి వీక్షకుల్లో ఆసక్తి పెరిగింది. బిగ్‌బాస్ సీజన్ -1 హిట్ కావడంతో రెండో సీజన్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. న్యాచురల్ స్టార్ నాని, వ్యాఖ్యాతగా రెండో సీజన్ గత నెల ప్రారంభమైన విషయం తెలిసిందే… ఈ సీజన్‌లో గీతామాధురి, అమిత్ తివారీ, దీప్తి, తనీష్, బాబు గోగినేని, భాను శ్రీ, రోల్ రైడా, యాంకర్ శ్యామల, కిరీటి, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి, గణేష్, సంజనా అన్నే, నూతన్‌నాయుడు, నందినిలు కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. వీళ్లల్లో సంజనా, నూతన్‌నాయుడు, తేజస్వి, కిరీటి, శ్యామల, భానుశ్రీ లు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. అయితే, సామ్రాట్-తేజస్వి మధ్య ఏదో నడుస్తుందన్న పుకార్లు బయటకు వచ్చాయి. ఈ గాసిప్స్ కు ఊతమిచ్చేలా ఈ జంట ప్రవర్తించింది. అంతేగాక తేజస్వి ఎలిమినేట్ అయినప్పుడు తనలా ఎవ్వరూ ప్రేమలో పడొద్దని చెప్పడం మరింతా చర్చనీయాంశమైంది. ఇక సామ్రాట్ విషయానికి వస్తే భార్యతో విభేదాల కారణంగా విడాకులు ఇచ్చేసి విడిగానే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో హౌస్ నుంచి బయటక వచ్చాక తేజస్విని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని కథనాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కానీ, తాజాగా ఆమె ఒక మీడియా సంస్థతో ఈ పెళ్లి పుకార్లపై మాట్లాడింది. సామ్రాట్ అంటే తనకు ఇష్టమే అని, అయితే అతడిని పెళ్లిచేసుకోవట్లేదని స్పష్టం చేసింది. తామిద్దరం ఎప్పటికీ మంచి మిత్రులుగా కొనసాగుతామని తెలిపింది. అంతకుమించి తమ మధ్య ఏమి లేదని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక సామ్రాట్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖతగా చేసే హిందీ ‘బిగ్ బాస్’ షోలో ఎన్ని ఎఫైర్లు నడిచాయో, ఎంతమంది ఇక్కడ లవర్స్ అయ్యారో, బహిరంగంగా వారు ఎలా రొమాన్స్ చేసుకున్నారో తెలిసేంది. గతేడాది తమిళ బిగ్ బాస్‌లో ఒవియా-ఆరవ్ మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం ఈ జంట సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.

Comments

comments