సాఫిగా సమీక్ష

ఆగని గ్రూపుల లొల్లి పోటాపోటీగా జన సమీకరణ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనందం  రెండు రోజుల పాటు జరిగిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశాలు సాఫీగా సాగాయి. నియోజక వర్గ స్థాయి నాయకులు మాత్రం ఎప్పటిలాగానే బలప్రదర్శనకు దిగారు. నినాదాలు, తోపులాటలు, కాంగ్రెస్‌కు సహాజమే అయినా ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంఎల్‌సి సలీం అహ్మద్ ముందు బలాన్ని ప్రదర్శించేందుకు కొంత మంది తహతహలాడారు. కాంగ్రెస్ కార్యకర్తల నుండి సమీక్షలపై సానుకూల స్పందన లభించింది. పల్లెల్లో పార్టీ, ఢిల్లీలో […]

ఆగని గ్రూపుల లొల్లి
పోటాపోటీగా జన సమీకరణ
కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనందం 

రెండు రోజుల పాటు జరిగిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశాలు సాఫీగా సాగాయి. నియోజక వర్గ స్థాయి నాయకులు మాత్రం ఎప్పటిలాగానే బలప్రదర్శనకు దిగారు. నినాదాలు, తోపులాటలు, కాంగ్రెస్‌కు సహాజమే అయినా ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంఎల్‌సి సలీం అహ్మద్ ముందు బలాన్ని ప్రదర్శించేందుకు కొంత మంది తహతహలాడారు. కాంగ్రెస్ కార్యకర్తల నుండి సమీక్షలపై సానుకూల స్పందన లభించింది. పల్లెల్లో పార్టీ, ఢిల్లీలో రిమోట్ అన్నట్లుగా ఉండే కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నేతల అభిప్రాయాలను తీసుకోవడం ప్రత్యేకమే.

మన తెలంగాణ/ఖమ్మం: 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశానుసారం పాత ఖమ్మం జిల్లాలో పార్టీ పరిస్థితిపై సోమ, మంగళవారాల్లో నగర పాలక సంస్థ పరిధిలోని సంజీవరెడ్డి భవన్ (కాంగ్రెస్ కార్యాలయం)లో సమీక్ష నిర్వహించారు. ఏఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్, టిపిసిసి కార్యనిర్వహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పోరిక బలరాం నాయక్, బండ్ల కార్తికరెడ్డిలు సమీ క్ష నిర్వహించారు. తొలి రోజు నియోజక వర్గాలపై సమీక్షించిన నేతలు మంగళవారం పార్టీ అనుబంధ సంఘాల పై సమీక్ష చేశారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతలు వనమా వెంకటేశ్వరరావు, యడవల్లి కృష్ణ వర్గాలతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. మిగిలిన నియోజక వర్గాలకు సంబంధించి సమీక్ష సాఫీగానే సాగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన శక్తియాప్ గురించి ఎక్కువగా కార్యకర్తలను, నేతలను ప్రశ్నించారు. పార్టీ అనుబంధ సంఘాల నిర్మాణం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు ప్రశ్నించడం క్షేత్రస్థాయి నేతలకు సంతృప్తినిచ్చింది. తొలిరోజు ఏఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్‌కు ఆహ్వానం పలుకుతూ పోటాపోటీగా ని నాదాలు చేసినా మంగళవారం సాయంత్రం వర్గాలకు అతీతంగా నేతలంతా హాజరు కావడం కార్యకర్తలకు ఊరటనిచ్చింది. మొత్తంగా రెండ్రోజుల పాటు జరిగిన స మీక్ష సమావేశాలు కార్యకర్తల్లో కదలిక తేగా డిసిసి అధ్యక్షుని నియామకం జరపకపోవడం అసంతృప్తినిచ్చింది.

Related Stories: