సర్‌ప్రైజ్‌ ఇవ్వకుండా ఉండవు కోడలా: నాగర్జున

Samantha Akkineni to act in Tamil and Telugu remakes

హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగర్జున తన కోడలు సమంతను మెచ్చుకున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యూటర్న్’. ఈ చిత్రానికి పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కాబోతోంది.శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ చూసిన నాగార్జున తన కోడల్ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ‘వావ్‌.. నువ్వు సర్‌ప్రైజ్‌ ఇవ్వకుండా ఉండవు కోడలా..! మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని రాశారు. దీనికి సమంత  ప్రతి స్పందన ఇచ్చారు. ‘నన్ను ఎప్పుడూ ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు మామ’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

Comments

comments