సర్కార్ వైద్యుల నిర్లక్ష్యం: పురిటిలో శిశువు మృతి

Medak AREA Hospital Doctors Do Neglect Thiere Dutys

మెదక్ టౌన్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పేద ప్రజలకు కార్పోరేటు స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో వేలకోట్ల రూపాయలను ఖర్చుపెడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ ఆసుపత్రులలో సిబ్బంది నిర్లక్ష్యం, వైద్యుల కొరతో అక్కడక్కడా ప్రాణాలు బలవుతునే ఉన్నాయి. శుక్రవారం నాడు పట్టణంలో ఏరియా ఆసుపత్రిలో పురిట్లోనే పుట్టిన శిశువు మృత్యువాత పడడానికి సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆసుపత్రి ముందు బాధితులు నిరసనకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రవీణ అనే గర్భిణీ ప్రసవం అనంతరం చనిపోయిన బిడ్డను డాక్టర్లు ఇచ్చారని బాధితులు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్నశంకరంపేట మండలానికి చెందిన ప్రవీణ గర్భం దాల్చినప్పటి నుండి సర్కారు దవాఖానలోనే ప్రతి నెల పరీక్షలు చేయించుకుంటూ చికిత్స చేయించుకుంటుంది. ఈ క్రమంలో గురువారం నాడు పురిటి నొప్పులు రావడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ వైద్యులు పరిక్షీంచి కాన్పుకు సమయం ఉందని చెప్పడం జరిగిందన్నారు. ప్రవీణకు పురిటినొప్పుల తీవ్రత ఎక్కువ కావడంతో భర్త నాని సిబ్బందిని కలిసి నొప్పులు అధికంగా ఉన్నాయని వెంటనే డాక్టర్లకు చెప్పి ప్రసవం చేయమని కోరగా అందుకు ఆమెకు బదులు నువ్వు నొప్పులు తీయ్యి అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాదానం చెప్పి వెళ్లరని, బెదిరించారని తెలిపాడు. దీంతో గర్భీణికి రాత్రి నుండే రక్తస్రవం జరిగిందని భాధితురాలు అక్క లక్ష్మి తెలుపగా సిబ్బంది పెడచెవిన పెట్టడంతో నొప్పులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రోజంత నరకయాతన చెందిన ప్రవీణకు ఆపరేషన్ చేయమని బంధువులు ఎంత వేడుకున్నా సిబ్బంది పట్టించుకోలేదని, శుక్రవారం మధ్యాహ్నం వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి ప్రసవం చేయగా మరణించిన శిశువు జన్మించిందని, శిశువుని తెచ్చి తమకు అందించారని బాధితులు రోధించారు. దీంతో ఆసుపత్రి ముందు మరణించిన శిశువుతో బాధితులు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పడంతో విరమించుకున్నారు.

Comments

comments