సరిహద్దు…దోపిడీ

Illegal Sand Mining Continues Gadwal in Telangana

నేతల కనుసన్నల్లో… తరలివెళ్తున్న సహజ సంపద
మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం
కోట్ల ఆదాయం కోల్పోతున్న తెలంగాణ

“ఆప్రాంతం రెండు రాష్ట్రాలను కలిపే సరిహద్దు ప్రాంతం… దీంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రకాల జీవనశైలీతో పాటుగా పరిపాలనా పరమైన ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది… అయితే ఇదే ఇప్పుడు కొందరు అక్రమార్కులకు దొంగ మార్గంలో కోట్లను సంపాదించిపెడుతుంది… ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న సహజ సంపదైన ఇసుక, మట్టి, కంకర, ఇటుక వంటి వన్నీ కూడ యథేచ్ఛగా వక్రమార్గంలో అక్రమంగా పక్కనున్న కర్నాటక రాష్ట్రానికి తరలివెళ్తున్నాయి… దీంతో ఏటా సుమారు వందకోట్ల పైనే రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయం కోల్పోతున్న పరిస్థితి. ఈ దందా గుట్టు చప్పుడుగా ఏమీ జరగడం లేదు… అందరికి తెలిసే… ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అందరి జేబులు నింపుతూనే విలువైన సహజసంపద తరలివెళ్లుతుంది. ఇంతకి ఈసహజ సంపద ఎక్కడకి తరలివెళ్తుంది.. దీనివెనకాల జరుగుతున్న అవినీతి భాగోతంపై మనతెలంగాణ ప్రత్యేక కథనం.

మనతెలంగాణ/గద్వాలప్రతినిధి: సరిహద్దులో.. హద్దులేని అక్రమాలు…: తెలంగాణ రాష్ట్రానికి ఆనుకుని సరిహద్దు ప్రాంతాలైన ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని మక్తల్ నియోజకవర్గంలోని, కృష్ణా, మగనూరు, కున్సి, గుడబల్లూరు, హిందూపూర్ ప్రాంతాలు కర్నాటక ప్రాంతంలోని రాయాచూరు జిల్లా, యాదగిరి జిల్లాలలకు సరిహద్దుగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాలైన తెలంగా ణ, కర్నాటక రాష్ట్రాలను కలుపుతూ టైరోడ్డు చెక్‌పోస్టు ప్రాంతంగా ఉంది. అయితే ఈప్రాంతాల్లో పెద్ద ఎత్తున మైనింగు సంబంధంధించిన క్రషర్(కంకర) మిల్లులు, ఇటుక బట్టీల పరిశ్రమలు, మట్టితవ్వకాలు వంటివి కొనసాగు తున్నాయి. ప్రధానంగా క్రషర్ (కంకర) మిల్లులు, ఇటుక బట్టీల పరిశ్రమలు కేవలం వంద అడుగుల దూరంలోనే పదుల సంఖ్యలో కొనసాగుతున్నాయి. నిత్యం వందల లారీలల్లో ఇటుక, కంకర, ఇసుక వ్యాపార లావాదేవీలు కొన సాగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడ మన రాష్ట్ర పరిధిలోని మైనింగు శాఖ అనుమతులతో కొనసాగుతున్నాయి. అయితే అనుమతుల ముసుగులో ఎ లాంటి రాయాల్టీ చెల్లించకుండానే పక్కనున్న కర్నాటక రాష్ట్రంలోని రాయా చూరు, యాదగిరి జిల్లాలకు ఈసహజ సంపద అక్రమంగా తరలివెళ్తుంది. అర్థం కాలేదా…? రాయాల్టీ కట్టింది కేవలం మన రాష్ట్రంలో వ్యాపారం చేసు కోవటానికి మాత్రమే. అయితే పక్క రాష్ట్రాల్లో దీనికి సంబంధించి వ్యాపారం చేయాలంటే అదనపు అనుమతులతో పాటు అదనపు రాయాల్టీ కూడ చెల్లించాలి. కాని ఇవేమి ఇక్కడ జరగడం లేదు.
బురద మట్టి, ఇసుకతో కలిపి తయారు చేసిన ఇటుక ఒక్కోటి రూ.6:50-7 వరకు విక్రయిస్తున్నారు. దీనికి రవాణ ఖర్చు అదనం. కంకర ఒక్కయూనిట్ కు రూ.2500 చొప్పున విక్రయిస్తున్నారు.టిప్పరు ఇసుక రూ.45-50వేల చొప్పున విక్రయిస్తున్నారు.మట్టి ట్రాక్టరుకు రూ.500-600చొప్పున విక్రయి స్తున్నారు. అయితే ఇలా వీటిని విక్రయించాలంటే ముందస్తుగా ప్రభుత్వ పర మైన రాయాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కంకర అయితే 1క్యుబిక్కు మీటరుకు రూ.75లు, అదే బ్లాస్టింగుతో కూడుకున్నదైతే రూ.250వరకు చెల్లించాలి. ఇసుక యూనిట్‌కు అయితే రూ.ట్రాక్టర్‌కు 4500చొప్పున చెల్లించాలి. ఇలా ప్రభుత్వానికి చెల్లించిన తరువాతనే స్థానికంగా నిర్ధేశించిన ప్రాంతా ల్లో మాత్ర మే క్రయవిక్రయాలు జరపాలన్నది ప్రభుత్వ నిబంధన లు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాని ఇక్కడ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కొనసాగుతుంది. అనుమతుల పేరిట వక్రమార్గం లో పక్కనున్న కర్నాటక ప్రాంతంలోని రాయాచూరు, యాదగిరి జిల్లాలకు సహజ సంపదను అధిక ధరలకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు.
మామూళ్ల మత్తులో యంత్రాంగం..: ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలు, టిప్పర్లల్లో బహిరంగానే పెద్ద ఎత్తున సహజసంపద దోపి డికి గురవుతుంటే చర్యలు చేపట్టాల్సిన అధికారులు మాత్రం నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు లంచాలకు అలవాటు పడిన అధికారులు అక్రమార్కులకు సహకరిస్తు జేబులు నింపుకునే కార్యక్రమానికి పాల్పడుతున్నారని స్థానికంగా వినిపిస్తున్న ఆరోప ణలు. పైగా ఈఅక్రమదోపిడి వెనకాల కొందరు పలుకుబడి కలిగిన నేతల హస్తం ఉండడం కూడ చర్యలు చేపట్టటానికి అధికారులు వెనకాడుతున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సుమారు రూ.100కోట్లు పైనే ఆదాయం కోల్పోతుంది. సరిహద్దు ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ దోపిడికి కల్లెం వేసి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Comments

comments