సరదా ట్వీట్‌తో సెలెబ్రిటీ స్టేటస్!

స్టార్స్ మొదలుకొని సామాన్యుడి వరకు అందరికీ సోషల్ మీడియా అనేది ఏం చెప్పాలన్న ఒక గొప్ప వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా మనిషి జీవితంలో భాగమైపోయిందీ సోషల్ మీడియా. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ఏదో ఒక యాప్ ఓపెన్ చెయ్యనిదే చాలా మందికి రోజు మొదలవ్వదంటే అతిశయోక్తి కాదేమో.అయితే, ఇదే సోషల్ మీడియాలో టైంపాస్ కోసం సరదా కబుర్లు చెప్పుకునే వారు ఉన్నారు. అలాగే కొందరు తమ వింత కోరికలను కూడా […]

స్టార్స్ మొదలుకొని సామాన్యుడి వరకు అందరికీ సోషల్ మీడియా అనేది ఏం చెప్పాలన్న ఒక గొప్ప వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా మనిషి జీవితంలో భాగమైపోయిందీ సోషల్ మీడియా. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ఏదో ఒక యాప్ ఓపెన్ చెయ్యనిదే చాలా మందికి రోజు మొదలవ్వదంటే అతిశయోక్తి కాదేమో.అయితే, ఇదే సోషల్ మీడియాలో టైంపాస్ కోసం సరదా కబుర్లు చెప్పుకునే వారు ఉన్నారు. అలాగే కొందరు తమ వింత కోరికలను కూడా బయటపెడుతుంటారు. అలా సరదాగా ఓ వ్యక్తి కోరిన వింత కోరిక అతన్ని పాపులర్ చేయడంతో పాటు సెలెబ్రిటీని చేసింది. అతడే అమెరికాకు చెందిన కార్టర్ విల్కర్సన్.

అసలు విషయం ఏమిటంటే… కార్టర్‌కు అమెరికాలోని ‘వెండీస్’ అనే ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో దొరికే ‘చికెన్ నగ్గెట్స్’ అంటే ప్రీతిప్రాయం. దీంతో ఒక రోజు ట్విట్టర్‌లో సరదాగా నాకు ఏడాదిపాటు ఉచితం(ఫ్రీ)గా నగ్గెట్స్ ఇవ్వడానికి ఎన్ని రీట్వీట్స్ కావాలంటూ వెండీస్ ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేశాడు. దీనికి అంతే సరదాగా 18 మిలియన్ అంటూ వెండీస్ నుంచి రిప్లై వచ్చింది. మనోడు దాన్ని స్క్రీన్ షాట్ తీసి ‘హెల్స్ మీ ప్లీజ్. ఎ మ్యాన్ నీడ్స్ హిజ్ నగ్స్’ అని పోస్ట్ చేశాడు. అంతే! కార్టర్ ట్వీట్‌కి నెటిజన్లు కూడా సరదాగా రీట్వీట్స్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ పోస్ట్‌కు లక్షల్లో రీట్వీట్స్ వచ్చి పడ్డాయి. అంతేకాదు ఈ రోజుకి ట్విట్టర్‌లో ఇదే మోస్ట్ రీట్వీటెడ్ పోస్ట్. ఇప్పటి వరకు ఏకంగా 3.6 మిలియన్ రీట్వీట్స్ వచ్చాయి. ప్రస్తుతం కార్టర్‌కు వెండీస్ ఫ్రీగా చికెన్ నగ్గెట్స్ ఇస్తుంది. అలాగే అతడు కోరినట్టు ఒక స్వచ్ఛంద సంస్థకు రూ. 69 లక్షలు విరాళంగా ఇచ్చిందట. ఇలా విల్కర్సన్ చేసిన సరదా ట్వీట్ అతడికి సెలెబ్రిటీ స్టేటస్‌ను తెచ్చిపెట్టిందన్నమాట.

Comments

comments