సమీక్షా సమావేశం

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాల్లో స్వచ్ఛత నెలకొనేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, గ్రామాల్లో నిర్మించుకున్న ప్రతి మరుగుదొడ్డినీ ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ప్రత్యేకాధికారులు, ఎంపిడివోలను ఆదేశించారు. శుక్రవారం నాడు కలెక్టరేటులో స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ-2018పై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామాలలో పరిశుభ్రత, వ్యర్థాల సేకరణ, మరుగుదొడ్ల వినియోగంపై ప్రత్యేకంగా సర్వే జరిపి జిల్లాల వారీగా ర్యాంకులను ప్రకటించడం జరుగుతుందన్నారు. […]

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాల్లో స్వచ్ఛత నెలకొనేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, గ్రామాల్లో నిర్మించుకున్న ప్రతి మరుగుదొడ్డినీ ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ప్రత్యేకాధికారులు, ఎంపిడివోలను ఆదేశించారు. శుక్రవారం నాడు కలెక్టరేటులో స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ-2018పై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామాలలో పరిశుభ్రత, వ్యర్థాల సేకరణ, మరుగుదొడ్ల వినియోగంపై ప్రత్యేకంగా సర్వే జరిపి జిల్లాల వారీగా ర్యాంకులను ప్రకటించడం జరుగుతుందన్నారు. కావున ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిర్మించుకున్న మరుగుదొడ్లను వినియోగించుకున్నారా, లేదా.. ఒకవేళ లేకుంటే వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి తడి, పొడి చెత్త వేరుగా చేసేలా విస్తృత  ప్రచారం కల్పించాలన్నారు. ఇంటి నుండే ప్లాస్టిక్ వేరు చేయగలిగితేనే రిసైకిలింగ్ చేసే అవకాశముందన్నారు. గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని నిధులు మంజూరైనా ఇప్పటికి కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాకపోవడంపై ఎంపిడివోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులపై అశ్రద్ద పనికిరాదని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల యాజమాన్య కమిటీల సమావేశం నిర్వహించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డివో సీతారామారావు, ఆర్డీవోలు నగేష్, వెంకటేశ్వర్లు, డిసివో వెంకట్‌రెడిడ ఇరిగేషన్ ఈఈ యేసయ్య, డీఎఫ్‌వో పద్మజారాణీ, డిడబ్లువో జ్యోతిపద్మతో పాటు ఇతర ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

Related Stories: