సమీకృత మత్స్య పథకం అమలు

Integrated seafood scheme implementation

జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన

మనతెలంగాణ/పెద్దపల్లి: జిల్లాలో సమీకృత మత్స అభివృద్ధి పథకాన్ని పారదర్శంకంగా నిర్వహిస్తున్నామని జిల్లా పాలనాధికారి శ్రీదేవసే న అన్నారు. పెద్దపల్లిలోని ఆర్యవైశ్య భవన్‌లో గురువారం సమీకృత మత్స పథకం లబ్దిదారుల జాబితా ఆమోదంకు జిల్లా స్థాయి ఎంపిక క మిటీ నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రా మీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కుల వృత్తులను పూర్వవైభవం తీసుకువచ్చే విధ గా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని అన్నారు. మత్స కారులకు వేయ్యి కోట్లతో పథకం అ మలు చేసిందని తెలిపారు. జిల్లాలో ఈ పథకం కింద ప్ర భుత్వం 3700 యూనిట్లను కేటాయించడం జరిగిందని, వీ టి కోసం 4800 దరఖాస్తులు స్వీకరించామని, ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అర్హుల జాబితాను సిద్ధం చేశామని,అర్హులు అ ధికంగా ఉండటం కారణంగా మొత్తం 3908 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని అన్నారు.జిల్లా లో 159 మత్స కారుల సంఘాలు ఉన్నాయని ప్రతి సంఘానికి మొబైల్ అవుట్‌లెట్, 99 సభ్యులు కలిసిన ప్రతి సంఘానికి 75శాతం సబ్సిడీతో 40 లగేజి ఆటోలు, 100 మ ందికి పైగా ఉన్న సంఘానికి ఒక ట్రక్కు, అందించడానికి ప్రభుత్వం ని ర్ణయించిందని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి యూనిట్లు అందిస్తామ న్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జీ డిఆర్‌డిఒ ప్రేమ్‌కుమార్, జి ల్లా మత్సశాఖ అధికారి మల్లేశం,జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రా జన్నతో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments

comments