సమాజంలో జర్నలిస్టుల పాత్ర విలువైనది

Refoters-image

ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డి

మన తెలంగాణ/వెల్దండ : ఈ సమాజంలో జర్నలిస్టుల పాత్ర విలువైందని మహబుబ్‌నగర్ ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డిలు అన్నారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో మండల జర్నలిస్టు టీం, యెన్నమ్స్ దంత వైద్యశాల కల్వకుర్తి వారి సం యుక్త ఆధ్వర్యంలో జరగిన ఉచిత దంత వైద్యశిబిరాన్ని వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. మొదటగా వేదికకు చేరుకున్న వారికి మండల జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి బ్యాడ్జిలు ధరింపజేశారు. అనంతరం రిబ్బెన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ హరికాంత్‌రెడ్డి, మానసారెడ్డిల ఆధ్వర్యంలో సుమారు 300 వందల మందికి దంత పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కసిరెడ్డినారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోళి శ్రీనివాస్‌రెడ్డిలు మాట్లాడుతూ ఈ సమాజం లో జర్నలిస్టుల వహిస్తున్న పాత్ర ఎంతో విలువైనదని, సమాజానికి పనికి వచ్చే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ఎంతో అబినందనీయమని అన్నారు.

ఘనంగా సన్మానం ….
ఉచిత దంత వైద్యశిబిరానికి ముఖ్య అతిధిగా వచ్చిన టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డిని, డాక్టర్ యెన్నమ్స్ దంత వైద్యశాల డాక్టర్లు హరికాంత్‌రెడ్డి, మానసారెడ్డిలను వెల్దండ జర్నలిస్టుల ఆధ్వర్యంలో శాలువా లూ, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ యెన్నం భూపతిరెడ్డి, గ్రామ సర్పంచ్ చిందం లక్ష్మికృష్ణయ్య, జడ్పీటీసి తనయుడు సంజీవ్‌కుమార్ యాద వ్, ఎంపిటీసిలు నెంట లలిత తంబాలు యాదవ్, జయప్రకాష్, పిఏసిఎస్ చైర్మెన్ ద్యాప మోహన్‌రెడ్డి, వెల్దండ పోలీసు వలయాది కారి గిరికుమార్ కల్కోట, జర్నలిస్టులు బచ్చు రామకృష్ణ, శేఖరాచారి, బొమ్మిశెట్టి శ్రీనివాసులు, కృష్ణయ్య, నాగరాజుగౌడ్, పురుషోత్తంరెడ్డి, రాజయ్య, తంబాలు, శ్రీను, రవి, రామకృష్ణ నాయకులు బీమయ్యగౌడ్, శంకర్‌నాయక్, గోరటి శ్రీను, చంద్రశేఖరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బొడ్రాయి ప్రతిష్ట

కల్వకుర్తి: మండల పరిధిలోని ఎగంపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట, లక్ష్మీనర్సింహ్మ వ్రిగహ ప్రతిష్టా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్ట వల్ల పాడిపంటలు, వర్షాలు సకాలంలో కురిసి రైతులు సుఖంగా ఉంటారని ఆయన అన్నారు. ఆయన వెంట మాజీ మంత్రి రాములు, కౌన్సిలర్లు , సర్పంచ్ తదితరులు ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, రా హుల్, శ్రీనివాస్‌రెడ్డిలు, బిజెపి నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి సతీమణి గీత, బిజెని నాయకులు శేఖర్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్, కృష్ణగౌడ్, ఎంపిపి రామేశ్వరమ్మ , నిర్వాహకులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.