సమస్యలను మానవీయ కోణంలో ఆవిష్కరించండి

దివ్యాంగుడి వినతికి చలించిన జెసి ప్రజావాణిలో ట్రై సైకిల్ అందజేత సమస్యలను మళ్లీ మళ్లీ రాకుండా చూడండి అధికారులకు జెసి ఆదేశం మనతెలంగాణ/పెద్దపల్లి: ప్రజా సమస్యల పట్ల మానవీయ కోణాన్ని అవిష్కరించాలని పెద్దపల్లి జిల్లా జా యింట్ కలెక్టర్ వనజాదేవి అధికారులకు సూచించా రు. సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించుతూనే,మా నవీయ విలువలు, సామాజిక బాధ్యతను మర్చిపోకు ండా ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని అన్నారు. సోమవారం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణిలో ఒదెల మండలం […]

దివ్యాంగుడి వినతికి చలించిన జెసి
ప్రజావాణిలో ట్రై సైకిల్ అందజేత
సమస్యలను మళ్లీ మళ్లీ రాకుండా చూడండి
అధికారులకు జెసి ఆదేశం

మనతెలంగాణ/పెద్దపల్లి: ప్రజా సమస్యల పట్ల మానవీయ కోణాన్ని అవిష్కరించాలని పెద్దపల్లి జిల్లా జా యింట్ కలెక్టర్ వనజాదేవి అధికారులకు సూచించా రు. సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించుతూనే,మా నవీయ విలువలు, సామాజిక బాధ్యతను మర్చిపోకు ండా ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని అన్నారు. సోమవారం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణిలో ఒదెల మండలం గూడెం గ్రామానికి చెందిన ఆడెపు రమేశ్ తాను దివ్యాంగుడినని,నడవడానికి చాల ఇబ్బందిగా ఉందని తనకు మూడు చక్రాల సైకిల్‌ను అందించాలని కోరగా,వెం టనే స్పందించిన జెసి వనజాదేవి జిల్లా సంక్షేమ అధికారితో మాట్లాడి ప్రజావాణిలోనే రమేష్‌కు ట్రై సైకిల్ అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజ లు తీసుకొచ్చే వినతులను సాధ్యమైనంత వరకు తమ పరిధిలో ఉంటే వాయిదా వేయకుండా పరిష్కరించాలన్నారు.సమస్యను పని ఒత్తిడి,ఇతర కారణాలు చూ పుతూ వాయిదా వేస్తే సమస్యలు పెరిగి పోతాయని తద్వారా ఆ అధికారికి చెడ్డ పేరు రావడంతో పాటు ప్రజలు ఒకే సమస్యపై పలుమార్లు ప్రజావాణి తలుపు తట్టడం జరుగుతోందన్నారు. సమస్యలను ఎప్పటి క ప్పుడు పరిష్కరించిప్రజలకు చేరువకావాలని సూచించారు.సోమవారం జరిగిన ప్రజావాణిలో మొత్తం 89 మందివివిధ సమస్యలపై ఆర్జీలు పెట్టుకోగా వాటన్నింటిని పరిశీలించిన జెసి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకుఆదేశించారు. సమస్య తమ పరిధిలోలేనప్పుడు అధికారులు ఆర్జిదారునికి సమస్యను వివరించి తగు సూచనలు అందజేయాలన్నా రు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు క ళ్యాణ లక్ష్మి,షాదిముబారక్,కేసిఆర్ కిట్,గొ ర్రెల పం పిణీ ,చేపల పంపిణీ తదితర అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని వాటిని సక్రమంగా లబ్ధిదారులకు అందే లా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి డిఆర్‌ఒ భైరం ప ద్మయ్య,జిల్లాపరిశ్రమలఅధికారి ప్రేమ్‌కుమార్,జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్, పౌరసనఫరాల అధికారి రహమాన్, జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్ ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: