సమరానికి సై…

సబితా రెడ్డి వర్సెస్ తీగల పోరు ఖాయం!                                                                                                    […]

సబితా రెడ్డి వర్సెస్ తీగల
పోరు ఖాయం!                                                                                                                                                    టికెట్ వేటలో అన్ని పార్టీల  ఆశావహులు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా : బడా బడా నేతలు బరిలోకి దిగడానికి సిద్ధమవుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. అభివృద్ధి మంత్రంతో అధికార పార్టీ ఎన్నికలకు సై అంటుండగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే అస్త్రంగా ప్రతిపక్ష పార్టీలు సమరంలోకి దూకుతున్నాయి. పార్టీ టికెట్లపై ఎలాంటి స్పష్టత లేకపోయినా టికెట్ కోసం లాబీయింగ్ చేసుకుంటూ నియోజకవర్గంలో పట్టుకోసం నేతలు ప్రయత్నా లు ముమ్మురం చేశారు. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2008లో మహేశ్వరం, కం దుకూర్, సరూర్‌నగర్ మండలంలోని కొంత ప్రాం తంను కలుపుకుని మహేశ్వరం నియోజకవర్గంను ఏర్పాటు చేశారు. 2009లో మాజీ మంత్రి సబితారెడ్డి(కాంగ్రెస్), 2014లో తీగల క్రిష్ణారెడ్డి(టిడిపి)ల తరపున విజయం సాధించారు. 2019 ఎన్నికల బరి లో దిగి శాసనసభలోకి అడుగుపెట్టడానికి నేతలు చాలా మంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

గత ఎన్నికలలో టిడిపి తరఫున బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి ఘన విజయం సాధించి అభివృద్ధి మంత్రం జపిస్తు టిఆర్‌ఎస్ పార్టీలోకి చేరిపోయారు. 2019 ఎన్నికలలో సైతం టిఆర్‌యస్ తరపున బరిలోకి దిగడానికి తీగల కృష్ణారెడ్డి పావులు కదుపుతు టిడిపి, కాంగ్రెస్‌లతో పాటు ఇతర పార్టీల నేతలను పార్టీలోకి చేర్చుకుంటు ముందుకు సాగుతున్నారు. తీగల క్రిష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు డాక్టర్ తీగల అనితారెడ్డి సైతం మామ బరిలోకి దిగకపోతే నేను రేడి అంటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్నారు. మామ, కోడలు ఇద్దరు నేనంటే నేను బరిలోకి దిగుతా అం టు తమ అనుచరుల వద్ద ప్రకటిస్తుండట కార్యకర్తలలో సై తం చర్చణీయాంశంగా మారింది. 2014 ఎన్నికలలో టిఆర్‌ఎస్ తరపున పోటిచేసి పరాజయం పాలైన కొత్త మనోహర్ రెడ్డి సైతం టికెట్ రేసులో తాను సైతం అంటు నియోజకవర్గంలో ప్రతి రోజు పర్యటిస్తూ సేవ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. గ్రంతాలయ సంస్థ చైర్మన కప్పాటి పాండు రంగారెడ్డి సైతం టికెట్ వస్తే పోటికి సిద్ధమవుతున్నారు. టి ఆర్‌ఎస్ కీలక నేత ఒకరు నియోజకవర్గంలో ఇటీవల సర్వే చేయించి అవసరమైన పక్షంలో బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నట్లు వినికిడి.

బరిలోకి మాజీ హోం మంత్రి సబితారెడ్డి
2009లో మహేశ్వరం నుంచి అఖండ మెజారిటితో విజ యం సాధించి రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన సబితారెడ్డి మరోమారు మహేశ్వరం నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖాయం. 2014 ఎన్నికలలో కుమారుడు కార్తీక్‌రెడ్డికి పార్లమెంట్ టికెట్ రావడంతో సబితారెడ్డికి పోటిచేసే అవకాశం దక్కకపోయిన నియోజకవర్గంలో ప్రతి రోజు పర్యటిస్తు ప్రజ ల మద్య కొనసాగుతున్నారు. పార్టీలకు అతీతంగా జనం సబితారెడ్డికి అండగా నిలబడే అవకాశం కనిపిస్తుంది. సబితారెడ్డి చేవెళ్ల పార్లమెంట్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతున్న తాను మాత్రం మహేశ్వరం నుంచి బరిలోకి దిగుతానని అదిష్టానం పెద్దలకు స్పష్టంగా చెప్పి నియోజకవర్గంలో విసృత్తంగా పర్యటిస్తున్నారు. సబితారెడ్డి బరిలో లేనిపక్షంలో దేప భాస్కర్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఉంది. టిడిపి సీనియర్ నేత మాజీ హోంమంత్రి తూళ్ల దెవేందర్‌గౌడ్ స్వంత నియోజకవర్గం కావడంతో పాటు టిడిపికి ఇక్క డ మంచి ఓటు బ్యాంకు ఉంది. తెలుగు యువత అధ్యక్షుడు వీరెందర్ గౌడ్ నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్న ఉప్పల్ నుంచి బరిలోకి దిగడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మైనార్టీ నేత ఆలీ మస్కతిని ఇక్కడ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. బిజెపి శాసనసభ పక్ష నేత జి.కిషన్ రెడ్డి స్వంత గ్రామం సైతం మహేశ్వరం నియోజకవర్గంలోనే ఉన్న ఇక్కడ ఆయన ప్రభావం నామ మాత్రమే. జిల్లా బిజెపి అధ్యక్షుడు బొక్క నర్సింహరెడ్డి, కార్పొరెటర్ రాధ దీరజ్ రెడ్డిలలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం కనిపిస్తుంది. మైనారిటీలు అధికంగా ఉండటంతో పా టు దాదాపు 80 వేల ఓట్లు ఉండటంతో ఎంఐఎం సైతం ఇ క్కడ నుంచి తమ అభ్యర్థిని బరిలోకి దించి అనూహ్య ఫలితాలను సాధించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. ప్రధాన పార్టీ ల అభ్యర్థులు అంతా హేమహేమిలు కావడంతో ఓట్ల చీలిక తో తమకు లాబిస్తుందని ఎంఐఎం అంచనా వేస్తుంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది నియోజకవర్గంలో జం పింగ్ జపాంగ్‌లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అభివృ ద్ధి మంత్రంతో టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన తీగలపై ని యోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న ఆశించిన పనులు జరుగలేదన్న చిన్న నిరాశ మాత్రం కనిపిస్తుంది.

నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 401660
పురుషులు 220824
మహిళలు 180823
ఇతరులు 13

Comments

comments

Related Stories: