సమగ్రాభివృద్ధికి సిఎం కృషి

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత మనతెలంగాణ/జగిత్యాల: కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమం త్రి కెసిఆర్ విశేష కృషి చేస్తున్నారని నిజామాబాద్ ఎంపి క ల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం జగిత్యాల మండలంలోని గుట్రాజ్‌పల్లిలో రూ.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణ పనులకు ఎంపి కవిత శం కుస్థాపన చేశారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన తె లంగాణతల్లి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.నూతనంగా నిర్మించిన […]

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/జగిత్యాల: కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమం త్రి కెసిఆర్ విశేష కృషి చేస్తున్నారని నిజామాబాద్ ఎంపి క ల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం జగిత్యాల మండలంలోని గుట్రాజ్‌పల్లిలో రూ.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణ పనులకు ఎంపి కవిత శం కుస్థాపన చేశారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన తె లంగాణతల్లి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపి మా ట్లాడుతూ, ప్రతి ఒక్కరిలో చిరునవ్వు చూడాలని ముఖ్యమ ంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ, అభివృద్ది పథకాలను అమలు చేస్తున్నారన్నారు.గుట్రాజ్‌పల్లిలో 300గడపలు ఉండగా 260మందికి వివిధ రకాల ఫించన్లు అందిస్తున్నామన్నారు. దీన్ని బట్టి చూస్తే దాదాపు ఇంటికో పెన్షన్ వస్తోందన్నారు. 124 యాదవ కుటుంబాలు ఉంటే ఇప్పటికే 63 కుటుంబాలకు గొర్రెల పంపిణీ పథకం కింద రూ.1.16 కోట్ల విలువ చేసే గొర్రెలను అందించామన్నారు. రైతు బంధు పథకం కింద పంటల సాగు పెట్టుబడి కోసం ఎకరాకు రూ. 4 వేల చొప్పున అందించడంతో పాటు రైతులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
విద్యుత్ డిమాండ్ అధికంగా ఉందని, సబ్ స్టేషన్ మం జూరు చేయించాలని రైతులు కోరగా సబ్‌స్టేషన్ మంజూరుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.నిజామాబాద్ ను ంచి జగిత్యాల మీదుగా కరీంనగర్‌కు వెళ్లేలా లోకమాన్య తి లక్ ఎక్స్‌ప్రెస్ రైలు రాబోతోందని, ఈ సౌకర్యాన్ని జిల్లా ప్ర జలు ఉపయోగించుకోవాలన్నారు.కాగా మొట్టమొదటి సా రిగా గుట్రాజ్‌పల్లికి వచ్చిన ఎంపి కవితకు గ్రామస్థులు, మ హిళలు మంగళహారతులు,బతుకమ్మలతో ఎదురువెళ్లి ఘన స్వాగతం పలికారు.-తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చిన్నారుల వేషధారణలు అలరించా యి.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు కుల పె ద్దలు, యువకులు టిఆర్‌ఎస్‌లో చేరగా ఎంపి కవిత కండువాలుకప్పిపార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్‌పర్సన్ తులఉమ,టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్‌రావు,జడ్‌పిటిసిపెండెం నాగలక్ష్మి, మా ర్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శీలం ప్రియాంక,సర్పంచ్ విజయలక్ష్మి,బాల ముకుందం, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసి లు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related Stories: