సమగ్రాభివృద్దే నా లక్ష్యం: ఎర్రబెల్లి దయాకర్‌రావు

దేవరుప్పుల ః పాలకుర్తి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే తన లక్ష్యమని ఎమ్యేల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని కడవెండి గ్రామాన్ని సందర్శించి ఇటివల చేపట్టిన అభివృద్ది పనులపై ఆరా తీశారు. ఈ సందర్బంగా గ్రామస్థులతో మాట్లాడుతూ మరిన్ని అభివృద్ది పనులు చేయాడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామానికి పంతం సత్తెమ్మ, దరగాని మల్లయ్య లు మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి అర్థిక […]


దేవరుప్పుల ః పాలకుర్తి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే తన లక్ష్యమని ఎమ్యేల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని కడవెండి గ్రామాన్ని సందర్శించి ఇటివల చేపట్టిన అభివృద్ది పనులపై ఆరా తీశారు. ఈ సందర్బంగా గ్రామస్థులతో మాట్లాడుతూ మరిన్ని అభివృద్ది పనులు చేయాడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామానికి పంతం సత్తెమ్మ, దరగాని మల్లయ్య లు మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి అర్థిక సహాహం అందజేశారు. పెద్దమడూర్ గ్రామ శివారు నల్లకుంటతండాకు చెందిన బానోతు ధర్గా మరణించగా మృత దేహానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ తీగల దయాకర్, కడవెండి గ్రామ సర్పంచి సుడిగల హనుమంతు, పెద్దమడూర్ గ్రామ సర్పంచి బొనగిరి నర్సింహా, నాయకులు లీనారెడ్డి, బిక్షపతి, కొండయ్య, రఫెల్‌రెడ్డి, కొల్లూరి సొమయ్య, మహెష్, వెంకట్‌రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: