సమంత, చైతన్యల పెళ్లి తేది, వేదిక ఫిక్స్…

Naga Chaitanya and Samantha Marriage News

హైదరాబాద్:  చాలా రోజులుగా సమంత, అక్కినేని నాగ చైతన్యల పెళ్లి విషయంలో రకరకాల పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లు ఇప్పట్లో పెళ్లి చేసుకోబోరని వీటి సారాంశం. అయితే వీటన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే అక్కినేని ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయని. సామ్-చైతుల వివాహాపు తేదీతో పాటు పెళ్లి వేదికను కూడా కుటుంబ సభ్యులు ఖరారు చేసినట్లు సమాచారం. దీని ప్రకారం వీరి పెళ్లి అక్టోబర్ 6న గోవాలో జరుగనుందట.

 మొన్నటివరకూ అక్టోబర్‌ నెలలో బ్యాంకాగ్ లోనో బాలి ఐల్యాండ్‌లో సామ్, చైతూ పెళ్లి ఉండబోతోందని ఇప్పటికే ఇరుకుటుంబ సభ్యులు అక్కడకి వెళ్లి వచ్చారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇటీవల చైతూ తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ను సమంతతో కలసి గోవాలోనే  చేసుకున్నా విషయం తెలిసిందే. దీంతో  అక్కడ వాతావరణం బాగా నచ్చి గోవాలోనే ఈ జంట ఒక్కటవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇరుకుటుంబాల నుంచి దీనిపై ఇప్పటి వరకు  ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలో  ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం ఇంకోన్ని రోజులు వేచిచూడక తప్పదు.

Comments

comments