సమంత కొత్త ఫీట్

Samantha

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది సమంత. తెలుగు, తమిళ్‌లో స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె పలు హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో ఆమెకు కోట్లాదిమంది అభిమానులున్నారు. సమంతకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్‌లో ఆమెకు 70 లక్షల మంది (7 మిలియన్ల) అభిమానులు ఉండడం విశేషం. ఈ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే ట్విట్టర్‌లో శృతిహాసన్, ధనుష్‌కు కూడా 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు వారి సరసన సమంత కూడా చేరిపోయింది. ట్విట్టర్‌లో రెగ్యులర్‌గా అభిమానులకు టచ్‌లో ఉండే తారగా ఆమె ఈ ఫీట్‌ను సాధించగలిగింది. సమంత తాను నటించిన సినిమాల ప్రమోషన్స్, ఫొటోషూట్స్‌ను సామాజిక మాధ్యమాల్లో నిరంతరం పోస్ట్ చేయడం వల్లనే ఇదంతా సాధ్యమైంది.

Comments

comments