సభ్యులు సహకరిస్తే వెంటనే అర్బన్‌బ్యాంక్ ఎన్నికలు

సిఇఒ పత్తిపాక శ్రీనివాస్ 34ఏళ్లలో మొదటి సారిగా పాలకవర్గంలోఎస్‌సి,ఎస్‌టి,మహిళా రిజర్వేషన్లు అమలు రూ.50కోట్ల డిపాజిట్లు…ఏటా 465.51కోట్ల లావాదేవీలు అక్టోబర్ 10తోముగియనున్న నామినేటెడ్ కమిటీ పదవీ కాలం మనతెలంగాణ/సిరిసిల్ల: సిరిసిల్ల సహకార అర్భన్‌ బ్యాంక్ సభ్యులు సహకరిస్తే పాలకవర్గం ఎన్నికలు వెంటనే పూర్తి చేస్తామని బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పత్తిపాక శ్రీనివాస్ అన్నారు. శనివారం సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు.సిరిసిల్ల సహకార అర్భన్‌బ్యా ంక్‌లో ఓటు హక్కు అర్హత కలిగిన 6300 మంది సభ్యులున్నారని ఆయన తెలిపారు. […]

సిఇఒ పత్తిపాక శ్రీనివాస్
34ఏళ్లలో మొదటి సారిగా పాలకవర్గంలోఎస్‌సి,ఎస్‌టి,మహిళా రిజర్వేషన్లు అమలు
రూ.50కోట్ల డిపాజిట్లు…ఏటా 465.51కోట్ల లావాదేవీలు
అక్టోబర్ 10తోముగియనున్న నామినేటెడ్ కమిటీ పదవీ కాలం

మనతెలంగాణ/సిరిసిల్ల: సిరిసిల్ల సహకార అర్భన్‌ బ్యాంక్ సభ్యులు సహకరిస్తే పాలకవర్గం ఎన్నికలు వెంటనే పూర్తి చేస్తామని బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పత్తిపాక శ్రీనివాస్ అన్నారు. శనివారం సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు.సిరిసిల్ల సహకార అర్భన్‌బ్యా ంక్‌లో ఓటు హక్కు అర్హత కలిగిన 6300 మంది సభ్యులున్నారని ఆయన తెలిపారు. వ్యవసాయం, సహకారశాఖ జిఒఎంఎస్ నెం.1 తేది. 04.01.2018 ద్వారా తె లంగాణ రాష్ట్ర సహకార సంఘాల చట్టం 1964లో ఎ న్నికల నియమావళిని సవరించారని,దీని ప్రకారం బ్యా ంకు సభ్యుల ఓటరు జాబితాలో సభ్యులందరి ఫొటో, కమ్యూనిటీ,వయస్సు,చిరునామా, సభ్యులు చేరిన తేది మొదలైన వివరాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని నిర్దేశించిన నేపథ్యంలో అర్భన్ బ్యాంకు సభ్యుల ఓటరు జా బితాను ప్రకటించామని తెలిపారు.తమ అభ్యర్థన మేర కు ఇప్పటి వరకు 1500మంది సభ్యులు తమ వివరా లు అందించారని తెలిపారు. మిగిలిన 4800మంది స భ్యులు తమ వివరాలు అందించాల్సి ఉందన్నారు. తా ము బ్యాంకు పరిధిలో మైకులద్వారా,స్థానిక కేబుల్ ప్ర సారాల ద్వారా, కరపత్రాల ద్వారా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సభ్యులు తమ వివరాలు అందించాల ని ప్రచారం సాగిస్తున్నామన్నారు.సభ్యుల సహకారం లభిస్తేతాము ఎన్నికల నిర్వహణకోసం 60రోజుల ము ందే సహకార ఎన్నికల కమిషనర్‌కు లిస్ట్ సమర్పిస్తామ ని తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో 34సంవత్సరాల క్రితం సహకార అర్భన్ బ్యాంక్ ను ప్రారంభించారు.బ్యాంకు ఆరంభం నుంచి లాభా ల బాటలోనే నడుస్తోంది.ప్రస్తుతం బ్యాంకులో 50కోట్ల రూపాయల డిపాజిట్లు ఉండగా,సభ్యులకు 35కోట్ల రూ పాయలు అప్పులిచ్చారు.సిరిసిల్లతో పాటు ఎల్లారెడ్డిపేటలో బ్యాంకు శాఖను కేవలం 13మంది రెగ్యులర్, ఆ రుగురు తాత్కాలిక సిబ్బంధితో నడుపుతున్నారు.గత సంవత్సరం బ్యాంకు 465.51 కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించింది.త్వరలో రెండు ఏటిఎంలను ప్రారంభించనుంది.రోజూ 700మందికి సగటున సేవలందిస్తోంది.12మంది పాలకవర్గ సభ్యులుండగా ఈ సారి కార్యవర్గం 10ఏప్రిల్ 2011న ఎన్నికైంది.10 ఏప్రిల్ 2016తో గడువు ముగిసినా వివిధ కారణాలతో పాలకవర్గం తమ పదవీ కాలాన్ని ప్రభుత్వ సహకారం తో పొడిగించుకుంటోంది.ప్రస్తుతం పొడిగించుకున్న కాలం కూడా అక్టోబర్ 10, 2018తో పూర్తి కానుంది. ఇటీవల వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంధ సంస్థలు అర్భన్‌బ్యాంకు పాలకవర్గం ఎన్నికలు జరపాల్సిందేనని ఆందోళనలు కూడా నిర్వహించాయి.ఈ పర్యాయం ఎ న్నికల్లో మొదటి సారిగా పాలకవర్గంలో మూడు స్థానాలకు (ఒక ఎస్‌సి లేదా ఎస్‌టి స్థానాన్ని,రెండు మహిళా స్థానాలకు)రిజర్వేషన్లు కూడా ప్రభుత్వం ప్రకటించిం ది.ఈ నేపథ్యంలోనే సభ్యులు తమ వివరాలు సకాలం లో సమర్పించి ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సిఇఒ పత్తిపాక శ్రీనివాస్ కోరారు.సభ్యులు ఎన్నికల స మయంలో ఫొటో,కులం,వయస్సుతదితర అంశాల కా రణంగా తిరస్కరణకుగురైతే అందుకు ఆయా సభ్యులు సమర్పించిన ఆధారాలే కారణమవుతాయని బ్యాంకు సిబ్బందికి సంబంధం ఉండదని అందువల్ల సభ్యులు త మ బాధ్యతగా భావించి సకాలంలో సరైన వివరాలు స మర్పించినిర్ణీత గడువులోగా ఎన్నికలు జరిగేందుకు స హకరించాలని కోరారు.

Comments

comments

Related Stories: