సభాస్థలికి చేరుకున్న కెసిఆర్

KCR Arrived to Pragathi Nivedana Sabha in Kongarakalan

రంగారెడ్డి : టిఆర్‌ఎస్ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభాస్థలికి తెలంగాణ సిఎం, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఆయన ప్రత్యేక విమానంలో కొంగరకలాన్‌కు చేరుకున్నారు. ఆయన వెంట ఎంపిలు కెకె, సంతోష్‌కుమార్, టిఎస్‌ఎండిసి చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సభలో సుమారు గంటన్నర సేపు కెసిఆర్ ప్రసంగిస్తారు. తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాది మంది తరలిరావడంతో కొంగరకలాన్‌లో జాతర సందడి నెలకొంది. ఆదివారం ఉదయం నుంచి తెలంగాణ కళాకారులు థూంథాం నిర్వహించారు. తెలంగాణ పల్లె పాటలు పాడుతూ ప్రజానీకానికి ఆహ్వానం పలికారు. ప్రగతి నివేదన సభ సందర్భంగా 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంగరకలాన్ నిఘా పడగ కింద ఉంది. సభా వేదికపై 270 మంది ప్రముఖులు ఆశీనులు అయ్యారు.

KCR Arrived to Pragathi Nivedana Sabha in Kongarakalan

Comments

comments