సబ్సిడీ గొర్రెలకు దాణా పంపిణీ…

 Subsidy sheep feeding distribution in Jangoan

గుండాల : రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు పంపిణీ చేస్తున్న దాణాను లబ్దిదారులు గొర్రెలకు అందించాలని పశువైద్యాధికారి గోపికృష్ణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సబ్సిడీ గొర్రెలను తీసుకున్న లబ్దిదారులకు దాణా పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను దళారులకు విక్రయించకుండా లబ్దిదారులే స్వయంగా కాపాడుకోవాలని అన్నారు. ఎవరైనా విక్రయించినట్లు సమాచారం తమకు అందితే వారికి అందే సబ్సిడీ దాణా, ఇతర సౌకర్యాలను వారికి అందకుండా చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సబ్సిడీపై వచ్చిన గొర్రెల్లో ఎలాంటి మార్పులు వచ్చినా గమనించి పశువైద్యుల సహకారంతో చికిత్స చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో తొట్టె భిక్షం, రంగు మల్లయ్య, మాదరబోయిన శ్రీను, గొర్రెలకాపర్లు పాల్గొన్నారు.

Comments

comments