సన్‌రైజర్స్ ఉత్కంఠ విజయం

sunrises

సన్‌రైజర్స్ ఉత్కంఠ విజయం
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు చాలా దూకుడుగా ఆడి 1 వికెట్ తేడాతో లక్షఛేదన చేశారు. కడవరకు పోరు విజయం ఎటువైపనా ఉండొచ్చన్న విధంగా చాలా ఉత్కంఠంగా సాగింది. శిఖర్ ధవన్ 8 ఫోర్లతో 45 పరుగులు, దీపక్ హుడా 32 పరుగులతో హైదరాబాద్ జట్టుకు విజయబాట వేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 11వ సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడాయి. టాస్ గెలిచిని సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ విలియమ్సన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సన్‌రైజర్స్ బౌలర్లు చెలరేగి ఆడారు. ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ లేకున్నా ముంబయి బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు నిలదొక్కుకోనివ్వకుండా కట్టడి చేశారు. సందీప్ శర్మ, బిల్లీ స్టాన్‌లేక్, సిద్ధార్థ్ కౌల్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. రోహిత్ శర్మ(11)ఎవిన్ లెవిస్(29), ఇషాన్ కిషన్(9)సూర్యకుమార్ యాదవ్(28) పొలార్డ్(28), కృనాల్ పాండ్య(15), బెన్‌కట్టింగ్(9), సాంగ్వాన్(0), మార్కండే(6),బుమ్రా(4) వరుసగా వెంటవెంటనే అవుట్ అయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్, స్టాన్‌లేక్, సిద్దార్థ్ కౌల్ తలో రెండు వికెట్లు తీశారు. స్లో ట్రాక్‌లో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేశారు. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు 148 పరుగుల లక్షాన్ని పెట్టారు. ముంబయి బౌలర్లలో మయంక్ మార్కండే 4 వికెట్లు, ముస్తఫిజుర్ రెహ్మాన్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు తీసుకున్నారు.
క్లుప్తంగా స్కోరు: ముంబయి ఇండియన్ ఇన్నింగ్స్ : 147/8(20.0 ఓవర్లు), సన్‌రైజరర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: 151/9( 20.0 ఓవర్లు)

Comments

comments