సన్న, చిన్నకారు రైతులకు అన్యాయం చెయ్యవద్దు: సిపిఐ

Government Do not be unfair to farmers In Medchal
శామీర్‌పేట రూరల్ : పేదల భూములు ప్రభుత్వం లాక్కోవడం సరైనది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎన్. బాలమల్లేశ్ ద్వజమేత్తారు. సోమవారం మండల కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అభివృద్ది పేరుతో సన్న, చిన్నకారు రైతుల భూములు ప్రభుత్వం లాక్కోని తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. అంతాయిపల్లి పరిధిలో1967 సంవత్సరంలో 87 సర్వేనంబర్‌లో 52.20 ఎకరాల భూమిని 25 మంది రైతులకు లావణి పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఇట్టి భూమిని సాగుచేసుకొని జీవిస్తున్న వారికి ప్రభుత్వం ఎలాంటి నోటీలులు ఇవ్వకుండా, నష్ట పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకొని కలెక్టర్ భవనాలు నిర్మించడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకుపోగా న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలను నిల బెట్టుకోలేదని విమర్శించారు. కేశవాపూర్ రిజర్వాయర్ పరిధిలో రైతులు సాగుచేసుకొనే భూములు తీసుకొని రిజర్వాయర్ నిర్మిస్తామనడం ఎందని విచారం వ్యక్తం చేశారు. దళిత, మైనార్టీ పేద రైతులు సాగు చేసుకొని జీవిస్తున్న భూములను లాక్కొని రోడ్డున పడేస్తున్నారన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు సిహెచ్ దశరథ, , మహిళ సమాఖ్య నాయకురాలు పద్మా, ప్రజానాట్యమండలి నాయకుడు జి.వెంకటచారి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments