సన్నాహక మ్యాచ్ డ్రా

చెమ్స్‌ఫోర్డ్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన సన్నాహక మ్యాచ్‌ను భారత జట్టు డ్రాగా ముగించింది. ఎసెక్స్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 395 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మురళీ విజయ్ (53), కెప్టెన్ విరాట్ కోహ్లి (68), లోకేష్ రాహుల్ (58), హార్దిక్ పాండ్య (51) అర్ధ సెంచరీలతో రాణించారు. మరోవైపు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, కీలక ఆటగాళ్లు శిఖర్ […]

చెమ్స్‌ఫోర్డ్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన సన్నాహక మ్యాచ్‌ను భారత జట్టు డ్రాగా ముగించింది. ఎసెక్స్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 395 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మురళీ విజయ్ (53), కెప్టెన్ విరాట్ కోహ్లి (68), లోకేష్ రాహుల్ (58), హార్దిక్ పాండ్య (51) అర్ధ సెంచరీలతో రాణించారు. మరోవైపు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, కీలక ఆటగాళ్లు శిఖర్ ధాన్, చటేశ్వర్ పుజారా (1), కరుణ్ నాయర్ (4), అజింక్య రహానె (17)లు నిరాశ పరిచారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఎసెక్స్ 8 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ వెస్ట్‌లి (57), మైఖేల్ (68) పరుగులు చేశారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పాల్ వాల్టర్ 75 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ జేమ్స్ ఫోస్టర్ 42 పరుగులు సాధించాడు. భారత బౌలర్లల ఉమేశ్ నాలుగు, ఇషాంత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ వరుసగా రెండో సారి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. లోకేష్ రాహుల్ 35 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. చటేశ్వర్ పుజారా 23 పరుగులు సాధించాడు. రహానె 19 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

Comments

comments

Related Stories: